త్రివిక్రం హీరోయిన్ ని మార్చేశాడు

త్రివిక్రం శ్రీనివాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా అ…ఆ. నితిన్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కూడా ఓ ప్రత్యేక పాత్ర చేస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రం సూర్య హీరోగా ఓ బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలకు వరుసగా సమంతని హీరోయిన్ గా తీసుకున్న త్రివిక్రం తను చేయబోయే సూర్య సినిమాకు కూడా ఆమెనే తీసుకుంటాడని అనుకున్నారు.

కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం త్రివిక్రం సూర్యతో తీసే సినిమాలో సమంత హీరోయిన్ గా తీసుకోవట్లేదట. ఇప్పటికే సూర్య నటిస్తున్న 24 సినిమాలో సమంతనే హీరోయిన్ గా చేస్తుంది. అందుకే సమంత అయితే ఒకటే జంట ప్రేక్షకులకు బోర్ కొట్టే అవకాశం ఉందని సూర్య చెప్పడంతో సమంతని ఆ ప్రాజెక్ట్ నుండి తప్పించారట. ఓ క్రేజీ బ్యూటీ అందులో అవకాసం లభిస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో వరుసెంట క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ ఫాంలో ఉన్న సమంత త్రివిక్రం సినిమా అంటే కచ్చితంగా సమంతే హీరోయిన్ అనేంతలా రూమర్స్ వచ్చాయి. మరి త్రివిక్రం ఇచ్చిన ఈ షాక్ కి సమంత ఎలా సమాధానం ఇచ్చి కవర్ చేస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిన్న జీయర్ స్వామి చరిత్రను వక్రీకరిస్తున్నారా?

ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులే. అయితే ఈ దాడుల నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఇవాళ ఆదోనిలో...

‘గ‌ని’గా వ‌రుణ్ తేజ్‌

`ఫిదా`, `తొలి ప్రేమ‌`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌` ఇలా వ‌రుస హిట్ల‌తో చెల‌రేగిపోతున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు బాక్స‌ర్ అవ‌తారం ఎత్తుతున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి అనే ద‌ర్శ‌కుడితో వ‌రుణ్ ఓ సినిమా...

శంక‌ర్ తెలుగు సినిమా.. అయ్యే ప‌నేనా?

భార‌తీయ ద‌ర్శ‌కుల‌లో శంక‌ర్ ది విభిన్న‌మైన శైలి. రెండు మూడేళ్ల‌కు ఒక సినిమానే తీస్తుంటాడు. అందులో త‌న ప్ర‌త్యేక‌త‌లు ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. శంక‌ర్ ఏం చేసినా భారీగానే ఉంటుంది. భారీ...

ఖమ్మం పంచాయతీ తీర్చేందుకు సిద్ధమైన కేటీఆర్..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. ప్రముఖలనదగ్గ నేతలందరూ టీఆర్ఎస్‌లోనే ఉన్నారు. వారి కోసం ఇతర పార్టీలు వలలేస్తున్నాయి. ప్రాధాన్యం దక్కకపోతే.. ఆ ప్రముఖ నేతలూ పార్టీలో ఉండే అవకాశం లేదు....

HOT NEWS

[X] Close
[X] Close