కేటీఆర్ చుట్టూ నాయకుల చ‌క్క‌ర్లు ఎందుకు.?

ఇచ్చిన హామీలు వంద‌శాతం నెర‌వేర్చాల‌నీ, అవినీతి ఏ స్థాయిలో క‌నిపించినా స‌హించేది లేదంటూ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నేత‌ల‌ను హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. కొత్త మున్సిప‌ల్ చ‌ట్టం వ‌స్తుంద‌నీ, ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని చెబుతూ వ‌స్తున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఇదే త‌ర‌హాలు ఈ మ‌ధ్య వ్యాఖ్య‌లు చేస్తుండేస‌రికి ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నాయ‌కుల్లో కొంత చ‌ల‌న‌మైతే వ‌చ్చింది. దీంతో తాజాగా మున్సిపాలిటీల్లో గెలిచినవారు, కొందరు ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డం మొద‌లుపెట్టారు! ఆయ‌న కోసం ప్ర‌గ‌తి భ‌వ‌న్లో ప‌డిగాపులు కాస్తున్నార‌ని స‌మాచారం! ఆయ‌న కోసం ఎందుకూ అంటారా… నిధుల కోసం!

రెండోసారి తెరాస అధికారంలోకి వ‌చ్చి ఏడాది గ‌డిచింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల అమ‌లు ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు! అవి చాల‌వ‌న్న‌ట్టుగా… మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రిన్ని హామీల‌ను గుప్పించారు. అన్నీ కాక‌పోయినా కొన్నింటినైనా కార్య‌రూపంలో చూపించాల్సిన అవ‌స‌రం ఉందనేది నేత‌ల అభిప్రాయం. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ప్ర‌జ‌లు త‌మ‌ని క‌లుస్తున్నార‌నీ, స‌మ‌స్య‌లు చెబుతున్నార‌నీ వెంట‌నే ఏదో ఒక‌టి చెయ్య‌క‌పోతే త‌మ‌పై ఒత్తిడి పెరుగుతుంది అంటూ నేత‌లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత నుంచి త‌మ‌కు నిధుల విడుద‌ల త‌గ్గిపోయింద‌నీ, క‌నీసం రాబోయే బ‌డ్జెట్లోనైనా పెద్ద మొత్తంలో నిధులు విడుద‌ల చేయించుకోవాల‌నేది నాయకుల ప్ర‌య‌త్నంగా తెలుస్తోంది.

ఈనెల మూడోవారంలో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మౌతున్న నేప‌థ్యంలో కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల నిధుల కోస‌మే నేత‌లు కేటీఆర్ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స్థానికంగా మేనిఫెస్టోల‌ను నేత‌లు విడుద‌ల‌ చేశారు. వాటిని నెర‌వేర్చాలన్నా, చాన్నాళ్లుగా పెండింగ్ ఉన్న ప‌నులు పునః ప్రారంభించాల‌న్నా పెద్ద మొత్తంలో మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌కు నిధుల‌ను విడుద‌ల చేయాల్సి ఉంటుంది. శాఖాప‌రంగా మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో, బ‌డ్జెట్ లో భారీ వాటా ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం ఎలా చేస్తారో చూడాలి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close