వార‌ణాసిలో బాల‌య్య వేట‌

సింహా,. లెజెండ్ చిత్రాల‌తో బాల‌కృష్ణ‌ని అభిమానుల‌కు న‌చ్చేలా తీర్చిదిద్దాడు బోయ‌పాటి శ్రీ‌ను. ఈ రెండు సినిమాల‌తోనే బోయ‌పాటి మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. ఇప్పుడు వీరిద్ద‌రూ ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. ఇది వ‌ర‌కే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఇప్పుడు రెగ్యుల‌ర్ షూటింగ్‌కి రంగం సిద్ధ‌మైంది. ఈనెల 26 నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌లెడ‌తారు. వార‌నాసిలో కొన్ని కీల‌క‌మైన సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. బాల‌య్య పాత్ర ఈ సినిమాలో రెండు కోణాల్లో సాగ‌బోతోంది. కొన్ని స‌న్నివేశాల్లో ఆయ‌న ఆఘోరాగా క‌నిపిస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌థానాయిక‌ల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. చాలామంది పేర్లు వినిపిస్తున్నా, ఆ ప్ర‌క్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని తెలుస్తోంది. ఇటు బాల‌య్య‌, అటు బోయ‌పాటి ఇద్ద‌రూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్ద‌రికీ ఓ హిట్టు త‌ప్ప‌నిస‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close