యోగి తల్చుకుంటే ఏ క్షణమైనా ఆర్జీవీ అరెస్ట్ !

ఆర్జీవీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కేసు నమోదైంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి అలాంటి ఫిర్యాదులు తెలుగు రాష్ట్రాల్లోనూ చేశారు. కానీ కేసుల నమోదు వరకూ వెళ్లలేదు. కానీ లక్నోలో పోలీసులు కేసులు పెట్టేశారు. ఆర్టీవీపై ఆషామాషీగా కేసులు పెట్టి ఉండరని.. తర్వాత చర్యలు ఉంటాయన్న చర్చ ప్రారంభమైంది.

యూపీ సీఎం ఆదిత్యనాథ్ కాషాయధారి కావొచ్చు కానీ ఆయన పాలన మొత్తం ” అంతా నా ఇష్టం ” అన్న తరహాలో ఉంటుంది. ఓ వర్గం ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం దగ్గర్నుంచి… రౌడిషీటర్ల పేరుతో కాల్చి చంపడాలు.. ఎన్ కౌంటర్ చేయడాలు లెక్కలేనన్ని జరుగుతూ ఉంటాయి. యూపీలో పరిస్థితులపై అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతూ ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా .. .ఏం జరిగినా.. ముఖ్యంగా సెంటిమెంట్ రెచ్చగొట్టేలా ఎలాంటివి చోటు చేసుకున్నా యోగి ప్రభుత్వం ఓ రేంజ్‌లో స్పందిస్తుంది. ఆర్జీవీపై కేసు విషయంలో తదుపరి చర్యలపై చర్చ అందుకే వస్తోంది.

రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు పలుమార్లు హిందూ దేవుళ్లను అవమానించారు. ఆయన వ్యాఖ్యలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఇలాంటివి బీజేపీ నేతలకు ముఖ్యంగా యూపీ సీఎం లాంటి వారికి నచ్చవు. చాన్స్ వస్తే దేవుడి పవర్ చూపించాలనుకుంటారు. ఇప్పుడు ఓ ట్వీట్ ద్వారా ఆర్జీవీ అలాంటి చాన్స్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆర్జీవీని ఏ క్షణం అయినా అరెస్ట్ చేసి తీసుకుపోయినా ఆశ్చర్యం లేదని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అంత సీరియస్‌గా తీసుకోరని కొంత మంది అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close