నాటి “పెర్‌ఫార్మెన్స్” నేడు కోర్టులో నిలబెట్టింది !

మంచు మోహన్ బాబు తన ఇద్దరు కుమారులతో కలిసి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. రోడ్డుపై ధర్నా చేసిన కేసులో ఆయనతో పాటు ఇద్దరు కుమారులపైనా కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణ వాయిదాలకు హాజరు కాకపోతూండటంతో వారెంట్ వచ్చే పరిస్థితి ఉండటంతో ఈ సారి ఇద్దరు కుమారులతో కలిసి హాజరయ్యారు. కోర్టుకు హాజరయ్యే విషయంలోనూ మోహన్ బాబు తనదైన నాటకీయత చూపించారు. పాదయాత్రగా కోర్టుకు హాజరయ్యారు.

ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో మోహన్ బాబు తన కాలేజీలకు చంద్రబాబు ప్రభుత్వం పీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వలేదని ఇద్దరు కుమారులతో పాటు స్టూడెంట్స్‌ను తీసుకుని రోడ్డెక్కారు. రోడ్డు మీద ధర్నా చేశారు. అడ్డంగా పడుకుని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిజానికి మోహన్ బాబు కాలేజీలకు ఇవ్వాల్సిన రీఎంబర్స్ మెంట్ మొత్తం ఇచ్చామని ఆ ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తి కానందున అప్పటిది మాత్రమే బాకీ ఉందని ప్రభుత్వం తెలిపింది. అయినా ఆయన పర్‌ఫార్మెన్స్ చేసిన తర్వాత వెళ్లి వైసీపీలో చేరిపోయారు.

అయితే ఆ రీఎంబర్స్‌మెంట్ డబ్బులు ఇంత వరకూ రాలేదని తెలుస్తోంది. మోహన్ బాబులాగే విద్యా సంస్థలు నడుపుతున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్పటి రీఎంబర్స్‌మెంట్ ఇప్పటికీ రాలేదన్నారు. మోహన్ బాబు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పారు కానీ.. ఈ ప్రభుత్వంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అయితే అప్పటి ప్రదర్శన ఇప్పుడు కోర్టుకు లాగింది. మరోసారి సెప్టెంబర్‌లో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close