తెరాస‌, భాజ‌పా దోస్తుల‌ని చెప్పాల‌ని ఉత్త‌మ్ ఇంకా ప్ర‌య‌త్నిస్తున్నారా..?

తెర వెన‌కగానీ, ముందుగానీ, లోపైకారీగానీ, ఇంకో ర‌కంగా… ఇలా ఏ ప్రాతిప‌దిక తీసుకున్నా తెరాస‌, భాజ‌పాల మ‌ధ్య దోస్తీ ఉంద‌నే ప‌రిస్థితి తెలంగాణ‌లో ఈ మ‌ధ్య క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ తెరాస‌కు భాజ‌పాతో కొన‌సాగాల‌ని ఉన్నా కూడా… రాష్ట్రంలో సొంతంగా ఎద‌గాల‌న్న ప‌ట్టుద‌లతో క‌మ‌ల‌ద‌ళం ఉంది కాబ‌ట్టి, అలాంటి పప్పులేవీ ఢిల్లీ స్థాయిలో ఉడ‌క‌నీయ‌డం లేద‌న్న‌ది చూస్తూనే ఉన్నాం. పైగా, భాజ‌పా కూడా ఇప్పుడు తెరాస వ్య‌తిరేక‌త‌ను ఒడిసిప‌ట్టుకోవ‌డ‌మే త‌మ ఎదుగుద‌ల‌కు వేదిక అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇంకా తెరాస‌, భాజ‌పాలు దోస్తులే… ఆ రెండూ ఒక‌వైపు, మేమొక్క‌ర‌మే మ‌రోవైపు అన్న‌ట్టుగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు.

హైద‌రాబాద్లో విలేక‌రుల‌తో ఆయ‌న మాట్లాడుతూ… ఈనెల 28న ఎన్నార్సీ, సీఏఏల‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ లో ర్యాలీ నిర్వ‌హిస్తామ‌నీ, అనుమ‌తులు కోరుతూ నాలుగు రోజుల కింద‌టే పోలీసుల‌కి విన‌తులు ఇచ్చామ‌నీ, ఇంత‌వ‌ర‌కూ స్పంద‌న లేద‌న్నారు ఉత్త‌మ్. వారు అనుమ‌తి ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా ఈ ర్యాలీ చేసి తీర‌తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తున్నా అంటూ… ఇప్ప‌ట్నుంచీ మేం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీతోగానీ, టి.ఆర్.ఎస్.తోగానీ ఏ విధ‌మైన వేదిక‌ల్నీ పంచుకోమ‌న్నారు. ఏ అంశంపై ఎవ‌రు పిలిచినా… భాజ‌పా, తెరాస అక్క‌డుంటే తాము వెళ్లేది ఉండ‌ద‌న్నారు. ఇంత‌వ‌ర‌కూ భాజ‌పా తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌న్నింటికీ కేసీఆర్ మ‌ద్ద‌తు ప‌లికార‌న్నారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో భాజ‌పా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల కంటే ముందే ఈయ‌న మ‌ద్ద‌తు ఇచ్చార‌న్నారు. జీఎస్టీకి, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకీ, ట్రిపుల్ త‌లాక్ బిల్లుకీ, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కూడా భాజ‌పా అభ్య‌ర్థికి కూడా ఇలానే మ‌ద్ద‌తు ఇచ్చార‌న్నారు. కేసీఆర్ మ‌ద్ద‌తు ప‌లికిన భాజ‌పా ఆర్థిక విధానాల వ‌ల్ల‌నే ఇవాళ్ల దేశంతోపాటు రాష్ట్రం కూడా ఆర్థికంగా కుదేల‌య్యే దిశ‌లో ఉంద‌న్నారు. ఇవ‌న్నీ తెలంగాణ స‌మాజం గుర్తుపెట్టుకోవాల‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close