ఎన్టీఆర్ బ‌యోపిక్‌… వారాహి చేతికి..??

నంద‌మూరి అభిమానులు, మ‌రీ ముఖ్యంగా బాల‌కృష్ణ ఫ్యాన్స్ దృష్టి ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ప‌డింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే.. క‌చ్చితంగా ఇండ్ర‌స్ట్రీ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్‌గా బాల‌య్య క‌నిపించ‌డం నిజంగా వాళ్ల‌కు ఓ పండ‌గ లాంటిదే. ప్ర‌స్తుతం బాలకృష్ణ స‌రైన ద‌ర్శ‌కుడి వేట‌లో ప‌డ్డాడు. తేజ ఎంపిక దాదాపుగా ఖాయ‌మ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. తేజ ఈ సినిమా చేయ‌డానికి రెడీ అంటున్నా.. త‌న‌కు కొంత టైమ్ కావాల‌ని కోరాడ‌ట‌. ఇప్పుడు ఈ సినిమాకి నిర్మాత ఎవ‌రన్న‌ది తేలిపోయింది. ఈ చిత్రాన్ని వారాహి సంస్థ‌లో చేయాల‌ని బాల‌య్య భావిస్తున్నాడ‌ట‌. లెజెండ్ వారాహి నుంచే వ‌చ్చింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ చేసే అవ‌కాశం ఇవ్వ‌మ‌ని సాయి కొర్ర‌పాటే స్వ‌యంగా కోరాడ‌ని, లెజెండ్ తో ఉన్న అనుబంధం వ‌ల్ల‌…. బాల‌య్య ఓకే చేశాడ‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని భాగ‌స్వామ్య ప‌ద్ధ‌తిలో తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయి. ఈ సినిమాతో బాల‌య్య నిర్మాణ రంగంలో కూడా అడుగుపెడ‌తార‌ని, ఆయ‌న ఓ సంస్థ‌ను స్థాపించి, నిర్మాత‌గా త‌న ప్ర‌యాణానికి ఈ సినిమాతోనే శ్రీ‌కారం చుడ‌తార‌న్న గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల విష‌యంలో బాల‌య్య ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టే అనుకోవాలి. అధికారిక ప్ర‌క‌ట‌న కోసం మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.