రాజకీయ సన్యాసం ఉత్తదే..! వైసీపీలోకే వంశీ..!

వైసీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారని.. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని.. టీడీపీ అధినేతకు.. వాట్సాప్‌లో గంభీరమైన లేఖ రాసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. నవంబర్ మూడు లేదా నాలుగో తేదీల్లో ముఖ్యమంత్రి సమయాన్ని బట్టి .. ఆయన కండువా కప్పుకోబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అనుచరులకు సమాచారం ఇచ్చిన వంశీ… అందర్నీ గ్రామాల వారీగా.. తనకు మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. తనతో పాటు వచ్చే వారందరి విషయంలో ఓ అవగాహనకు వస్తున్నారు. గన్నవరంలో తన కార్యాలయం నుంచి ఇప్పటికి.. టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫోటోలను తొలగించారు. ఇక జగన్ ఫోటోలు… వైసీపీ రంగులు పూయడమే మిగిలింది.

అనుచరులను కాపాడుకోవడానికే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చంద్రబాబుకు చెప్పిన వంశీ.. ఇప్పుడు ఆ అనుచరులను కాపాడుకోవడానికే.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా.. చెప్పే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి.. తనను.. తన అనుచరుల్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని వంశీ చెబుతున్నారు. దీనంతటికి వైసీపీలో చేరడమే పరిష్కారమని.. నమ్ముతున్నారు. వైసీపీలో చేరితే తన కేసులకు.. తన ఆస్తులకు రక్షణ ఉంటుందని… వంశీ ఆలోచన అని అనుచర వర్గాలు చెబుతున్నాయి.

మరో వైపు వల్లభనేని వంశీతో మాట్లాడేందుకు.. చంద్రబాబు.. కేశినేని నాని, కొనకళ్ల నారాయణలను పురమాయించారు. వారు.. వంశీతో మాట్లాడేందుకు ఫోన్లు చేశారు. స్విచ్ఛాఫ్ రావడంతో.. మాట్లాడలేకపోయామని వారు చెబుతున్నారు. మళ్లీ వల్లభనేని వంశీతో మాట్లాడేందుకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో.. తెలుగుదేశం పార్టీ కూడా వంశీ విషయాన్ని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. వంశీ చేరికతో.. గన్నవరం నియోజకవర్గం.. వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి కూడా అపాయింట్‌మెంట్‌ ఖరారు చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

రీఎంట్రీకి శిశికళ రెడీ !

తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం,...
video

కల్కి.. సమయం చూడని సమరం

https://www.youtube.com/watch?v=5UfGZFrXKig మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించిన ఈ పాట... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close