బాబులో మాంఛి కామెడీ ఉందండోయ్‌

వెంక‌టేష్ సినిమా అంటేనే బోల్డంత కామెడీ. ఆయ‌న క‌న్నీళ్లు పెట్టించే సినిమాలు చేసినా.. అందులోనూ త‌న మార్క్ వినోదం మిస్ అవ్వ‌కుండా చూసుకొంటుంటారు. తాజాగా బాబు బంగారంలోనూ కావ‌ల్సినంత కామెడీ మిక్స్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాబు బంగారం టీజ‌ర్ ఈరోజే బ‌య‌ట‌కు వ‌చ్చింది. టీజ‌ర్‌లో పెద్ద‌గా మెరుపులేం లేక‌పోయినా, వెంకీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. ఈ సినిమాలోనూ కామెడీ ఇర‌గ‌దీసిన‌ట్టే క‌నిపిస్తోంది. మారుతి స్వ‌త‌హాగా కామెడీ బాగా రాస్తాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌కి ప్ల‌ప్ అయ్యింది ఆ కామెడీ పంచ్‌లే. ఈసారీ… మారుతి ప‌న్ను పదునెక్కి ప‌రుగులు పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఈరోజుల్లో కుసింత న‌వ్విస్తే చాలు.. సినిమాల్ని సూప‌ర్ హిట్ చేసేస్తున్నారు ఆడియ‌న్స్‌. అదే.. బాబు బంగారంకి శ్రీ‌రామ‌ర‌క్ష‌. న‌య‌న‌తార కూడా యాడ్ అవ్వ‌డంతో బిజినెస్ ప‌రంగా క్రేజ్ పెరిగింది. దానికి తోడు ఈ సినిమాకి బిజినెస్ కూడా బ్ర‌హ్మాండంగా జ‌రిగిపోతోంది. టేబుల్ ప్రాఫిట్‌కి ఈ సినిమాని అమ్మేశార‌ని టాక్‌. ఈ సినిమా హిట్ట‌యితే మారుతి టాప్ లీగ్ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోవ‌డం ఖాయం. కాబ‌ట్టి ఆయ‌నా ఈ సినిమాని చాలా ప్రెస్టేజియ‌స్‌గా తీసుకొన్నాడ‌ట‌. మ‌రి ఈ బాబు బాక్సాఫీసుని ఎంత ద‌డ‌ద‌డ‌లాడిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close