ప్రతి తెలుగువాడూ గర్వపడే సమయమిది-వెంకటేష్

చరిత్ర సృష్టిస్తున్న రాజమౌళి చిత్రం బాహుబలిని హీరో విక్టరీ వెంకటేష్ చూశారు. రాజమౌళికి, అతని బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభాస్, రానా సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్, విజువల్ ఎఫెక్స్ తదితర వందలాదిమంది టెక్నిషియన్స్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి కృషి చేశారని అన్నారు. వారందరూ ఇటువంటి సెల్యూలాయి వండర్‌ను సృష్టించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

ఇటువంటి చిత్రాన్ని రెండు సంవత్సరాల కాలవ్యవధిలోనే ఇంత విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక అద్భుత చిత్రంగా మలిచి ప్రపంచస్థాయిలో తెలుగు సినిమాకి గొప్ప పేరు తీసుకొచ్చారని అన్నారు. అంతర్జాతీయస్థాయి ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి నీరాజనాలు పడుతున్నారని చెప్పారు. రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు అభినందనలు తెలిపారు. కథను నమ్మి భారీ బడ్జెట్ తో నిర్మించారని చెప్పారు. వారి కృషి, నమ్మకం తెలుగు సినిమా సామర్థ్యాన్ని చాటి చెప్పిందని అన్నారు. రాజమౌళి, బాహుబలి చిత్రంతో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశాడని, ప్రతి తెలుగువాడు గర్వపడే సమయమిది అని వెంకటేష్ వ్యాఖ్యానించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close