విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘రౌడీ జనార్ధన’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ ఇప్పటివరకూ చూడని మాస్ అవతార్ లో కనిపించాడు.
బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడు గురించి ఎప్పుడైనావిన్నావా.. నేను చూశా
కొమ్ములతో ఆడి కథను ఆడే రాసుకున్నాడు..
కన్నీళ్ళని ఒంటికి నెత్తురులా పూసుకున్నాడు..
చావు కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే కత్తిలా లేచి కలబడినాడు.. కనబడ్డాడా.. నా లోపల..’ ఈ వాయిస్ ఓవర్ తో మిదలైన గ్లింప్స్ ఒక బ్లడ్ బాత్ ని తలపించింది.
‘నాకాడ ఉన్నారు కొమ్ములు తిరిగిన రాక్షసులు.. రక్తానికి మరిగిన రౌడీలు” అనే డైలాగ్ కి కౌంటర్ గా”కలింగపట్నంలో ఇంటికి ఒకడు రౌడీ నేను రౌడీ అని చెప్పుకొని తిరుగుతాడు. కానీ ఇంటి పేరుని రౌడీగా మార్చుకున్నాడు. ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన’ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ తో టీజర్ ముగిసింది. టీజర్ లో ఒక సెన్సార్ డైలాగ్ కూడా వుంది.
ఈ గ్లింప్స్ సినిమా ఎంత వైలెంట్ గా ఉండబోతుందో చుపించారు. 80ల నాటి కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇది. 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
