విజయసాయిరెడ్డి చేసిన నిర్వాకానికి ఆయన కుమార్తె ఇప్పుడు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సముద్ర తీరంలో సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిందుకు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి పదిహేడునున్న కోట్ల మేర జరిమానా విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియమితులైన కమిటీ ఈ ఈ మేరకు సిఫారసు చేసింది. బీచార్ లో అక్రమ నిర్మాణాలు చేసినందుకు రోజుకు లక్షా ఇరవై వేల చొప్పిన 1455 రోజుల పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిఉంది. అవి పూర్తయ్యే వరకూ అదనంగా రోజుకు రూ. లక్షా ఇరవై వేలు కట్టాల్సి. మూడు నెలల్లోనే పునరుద్ధరించకపోతే జరిమానా రెట్టింపు చేస్తారు.
వైసీపీ హయాంలో తమకు ఎదురే లేదని అనుకున్నారు వైసీపీ నేతలు. జగన్ రెడ్డి రుషికొండకు గుండు కొడితే.. విజయసాయిరెడ్డి బీచ్ ను కబ్జా చేశారు. కుమార్తె పేరు మీద భారీ రిసార్ట్స్ ను నిర్మించేందుకు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారు. బీచ్ లో చాలా తోతుగా తవ్వి గోడలు కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడు అదంతా నిబంధనలకు విరుద్ధమని.. పర్యావరణానికి తూట్లు పొడిచారని తేలడంతో ఆయన కుమార్తెపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జరిమానా చెల్లించాల్సి ఉంది. చెల్లించకపోతే రెట్టింపు చేస్తారు.
కోర్టు ఆదేశాలతో బీచ్ లో నిర్మాణాలు తొలగించినప్పటికీ వ్యర్థాలను ఇంకా అక్కడే ఉంచారు. ఇది కూడా పర్యావరణ కమిటీకి తన నివేదికలో తెలిపింది. బీచ్ లో గోడను కింద నుంచి తొలగించడానికి అవసరమ్యే ఖర్చును కూడా నేహారెడ్డి డిపాజిట్ చేయాల్సి ఉంది. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ఎప్పటికైనా చట్టం చేతులు పట్టేస్తుందని విజయసాయిరెడ్డి వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది.