విక్ర‌మ్ కె.కుమార్ తో రామ్ చ‌ర‌ణ్‌?

13బి, ఇష్క్‌, మ‌నం, 24 లాంటి చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు విక్ర‌మ్ కె.కుమార్‌. మ‌నం అయితే ఓ క్లాసిక్‌గా మిలిపోయింది. విక్ర‌మ్‌తో సినిమా చేయ‌డానికి టాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఉత్సాహం చూపించ‌డానికి త‌న ట్రాక్ రికార్డు, క‌థ‌ల ఎంపిక ఓ కార‌ణమైంది. అయితే ఇటీవ‌ల విక్ర‌మ్ పూర్తిగా ట్రాక్ త‌ప్పాడు. హ‌లో ఫ్లాప్ అయ్యింది. గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌లితం కూడా అంతంత‌మాత్ర‌మే. దాంతో విక్ర‌మ్‌కి మ‌రో అవ‌కాశం రావ‌డం క‌ష్టం అవుతుందేమో అనుకున్నారంతా.

కానీ ఇప్ప‌టికీ మ‌న స్టార్ హీరోల‌కు విక్ర‌మ్‌పై న‌మ్మ‌కం స‌డ‌ల్లేదు. తాజాగా రామ్‌చ‌ర‌ణ్ కూడా విక్ర‌మ్‌తో పనిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు టాక్‌. ప్ర‌స్తుతం RRR షూటింగుతో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్‌. త‌న‌తో పని చేయ‌డానికి చాలామంది ద‌ర్శ‌కులు రెడీ గా ఉన్నారు. చ‌ర‌ణ్ కూడా కొంత‌మంది ద‌ర్శ‌కుల‌కు మాట ఇచ్చాడు. అలా మాట ఇచ్చిన‌వారిలో విక్ర‌మ్ కూడా ఉన్నాడు. విక్ర‌మ్‌తో తాను ప‌నిచేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్య్వూలో చెప్పుకొచ్చాడు చ‌ర‌ణ్‌. విక్ర‌మ్ త‌దుప‌రి తెలుగు సినిమాలో.. చ‌ర‌ణ్ హీరోగా ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close