ఇప్పుడే కాదు.. జనవరి ఒకటి నుండి గ్రామ సచివాలయాల పాలన..!

గ్రామ సచివాలయాలు జనవరి ఒకటో తేదీ నుంచి సేవలందిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శరవేగంగా ఉద్యోగుల్ని నియమించి… గాంధీ జయంతి రోజున గ్రామ, వార్డు సచివాలయాల్ని ప్రారంభించేసినప్పటికీ.. మూడు నెలల తర్వాతే అవి సేవలందిస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించడం… చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలాయలకు కావాల్సిన సరంజామా కోసం నిధులు విడుదల చేశారు. కుర్చీలు, కంప్యూటర్లు అన్నీ సిద్ధం చేశారు. ఉద్యోగుల్ని అఘమేఘాలపై నియమించారు. అయినప్పటికీ.. మూడు నెలల తర్వాతే సేవలు ప్రారంభమని జగన్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన జగన్‌ … కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగుల నియమించామని ప్రకటించారు. సచివాలయ ఉద్యోగులకు అనుసంధానంగా గ్రామ వాలంటీర్లు ఉంటారని.. గ్రామ సచివాలయాల ద్వారా 500రకాల సేవలు ప్రజలకు అందుతాయన్నారు.

మళ్లీ గెలిచేలా పాలన ఉండాలని సచివాలయ ఉద్యోగులు గుర్తుంచుకోవాలని జగన్ దిశానిర్దేశం చేశారు. గత ఐదేళ్లలో ఏ పనికైనా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని… తమ కార్యకర్తలకే జన్మభూమి కమిటీలు ప్రాధాన్యత ఇచ్చేవని గుర్తు చేశారు. అర్హుల ఇంటికే సంక్షేమ పథకాలు చేరుస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సచివాలయం పక్కన ఎరువులు-విత్తనాల కేంద్రం.. వ్యవసాయ పనిముట్ల వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధిలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లది కీలకపాత్ర పోషించాలన్నారు. మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తామని .. స్కూళ్లు, పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మార్పులు తీసుకొస్తామని మరోసారి చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు .. స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వ ఘనతల్ని వివరించారు.

పలు చోట్ల గ్రామ, వార్డు సచివాలయాల్ని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అయితే.. నియామకాలు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. వివిధ విభాగాల వారికి ఇంకా నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. వారికి ట్రైనింగ్ లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సి ఉంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఆశావర్కర్లు లాంటి ఇతర ఉద్యోగులతో సమన్వయం చేయాల్సి ఉంది. దీని కోసం.. అధికారులు కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నారని.. అందుకే జనవరి ఒకటో తేదీ నుంచి గ్రామ సచివాలయాల సేవలు… అందించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు – కష్టకాలం మొదలైనట్లేనా..?

ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మరో వైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలపై విచారణ వేగంతో బీఆర్ఎస్ పెద్దలకు ఇబ్బందులు తప్పవని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్....

కేశినేని బాటలోనే మరికొంతమంది వైసీపీ లీడర్స్!

వైసీపీలో చాలామంది నేతలు కేశినేని నాని దారిలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. ఇంకా వైసీపీలో కొనసాగితే రాజకీయంగా మనుగడ ఉండే పరిస్థితులు లేవని ఓ అంచనాకు వస్తున్నారు. ఓటమి నుంచి తేరుకొని మరో...

వైసీపీ క్యాడర్ దివాలా ఆరా మస్తాన్ పాపమే !

తప్పుడు సర్వే ఇవ్వడానికి ఆరా మస్తాన్ కు ఎన్ని నిధులు అందాయో కానీ... ఆయన వల్ల వైసీపీ క్యాడర్ దివాలా తీసింది. ఎన్నికల ఖర్చుల కన్నా ఎక్కువగా బెట్టింగుల ద్వారా సర్వం కోల్పోయామని...

నాగ్ అశ్విన్ గట్స్… మెచ్చుకోవాల్సిందే

పోస్టర్ మీద ఐదు భాషలు పేర్లు రాసి 'పాన్ ఇండియా మూవీ' అని వేసుకోవడం చాలా సింపుల్. కానీ నిజంగా పాన్ ఇండియా సినిమాగా తయారు చేయడం చాలా కష్టం. కల్కి విషయంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close