విష్ణు, రాజ్‌తరుణ్‌ నూతన చిత్రం ప్రారంభం

మంచు విష్ణు, సోనారిక, రాజ్‌తరుణ్‌, హెబ్బా పటేల్‌ నటీనటులుగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నం:5 చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. విష్ణుకి ‘దేనికైనా రెడీ’ వంటి సూపర్‌హిట్‌ ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ టీవీ సమర్పణలో సుంకర రాంబ్రహ్మం నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి డా.మోహన్‌బాబు క్లాప్‌నివ్వగా, ఆయన సతీమణి నిర్మల కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. మంచు మనోజ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ”నాగేశ్వరరెడ్డి మార్క్‌ కామెడీతో ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిది. సోమవారం నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తాం. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని నిర్మాత తెలిపారు.

నటీనటులు-సాంకేతిన నిపుణులు:
రాజేంద్రప్రసాద్‌, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, సుప్రీత్‌, శత్రు, ధనరాజ్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యకృష్ణ, హేమ, గీతాసింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: నరేష్‌ కథూరియా, స్మీప్‌ కాంగ్‌, మాటలు: డైమంట్‌ రత్నబాబు, సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్‌: ఎమ్‌.ఆర్‌ వర్మ, ఆర్ట్‌: నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గరికపాటి కిషోర్‌, మేకప్‌: రంగా, కాస్టూమ్స్‌: శివ-ఖాదర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రాంబాబు, ఛీఫ్‌ కో డైరెక్టర్‌: గోపి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close