విశ్వక్సేన్కి గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేవు. మంచి కాంబినేషన్లు సెట్ అవుతున్నప్పటికీ ప్రేక్షకులను పూర్తిగా అలరించే సినిమాలు మాత్రం రావడం లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లైలా, మెకానిక్ రాకీ వరుసగా నిరాశజనక ఫలితాలే ఎదురయ్యాయి. తాజాగా వచ్చిన ‘ఫంకీ’ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం, నాగ వంశీ లాంటి నిర్మాత ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌పై మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పుడు విశ్వక్ స్వీయ దర్శకత్వంలో కల్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు చాలా కీలకంగా మారబోతోంది. ఈ నగరానికి ఏమైంది సినిమాతో విశ్వక్ యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేసింది మాత్రం ఫలక్నామా దాస్. ఆ సినిమా విశ్వక్ దర్శకత్వంలోనే వచ్చింది. తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ధమ్కి పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
ఇప్పుడు హీరోగా దర్శకుడిగా విశ్వక్‌కు కల్ట్ సినిమా విశ్వక్ కి కీలకం. మార్క్, కిల్, హిట్ 3 తరహా వైలెన్స్ సినిమా ఇది. ఫస్ట్ లుక్ కూడా అదే వైబ్‌ను ఇస్తోంది. టీజర్‌ను కూడా ప్రేక్షకులను ముందుగానే ఆ వైలెన్స్‌కు ప్రిపేర్ చేసేలా కట్ చేయబోతున్నారు. ఫంకీ లాంటి నిరాశ తర్వాతే వెంటనే కల్ట్ లాంటి సినిమా, అదీ విశ్వక్ దర్శకుడిగానే రావడం మంచిదే. ఇప్పుడు హిట్ కొట్టే భాద్యత పూర్తిగా విశ్వక్ చేతిలోనే వుంది.
