వాహ్వా… వైవా!

వైవా హ‌ర్ష‌. యూ ట్యూబ్‌లో స్టార్. త‌న వీడియోల‌న్నీ ల‌క్ష‌ల హిట్స్ అందుకున్నాయి. వైవా హ‌ర్ష షార్ట్ ఫిల్మ్ అంటే.. యూ ట్యూబ్ ఫాలోవ‌ర్ల‌కు మంచి కాల‌క్షేపం. అయితే.. ఆ క్రేజ్ ని సినిమాల్లో నూ చూపించ‌లేక‌పోయాడు. కొన్ని సినిమాలు చేసినా వైవా హ‌ర్షకు ఎలాంటి బ్రేక్ ఇవ్వ‌లేక‌పోయింది. `యూ ట్యూబ్ కి ఎక్కువ – సినిమాకి త‌క్కువ‌` అన్న‌ట్టు సాగిపోయింది త‌న కెరీర్‌. అయితే ఇప్పుడు అనూహ్యంగా త‌న చేతినిండా ఆఫ‌ర్లు. ఒక‌టి కాదు, రెండు కాదు. ఏకంగా ఆరు సినిమాలు వైవాని వెదుక్కుంటూ వ‌చ్చాయి. ఇదంతా..`క‌ల‌ర్ ఫొటో` పుణ్యం.

ఆహాలో విడుద‌లైన సినిమా `క‌ల‌ర్ ఫొటో`. ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణే ల‌భించింది. అయితే సుహాస్ కంటే.. వైవా హ‌ర్ష గురించే ఎక్కువ‌గా మాట్లాడుకున్నారు జ‌నాలు.  ఓ మంచి ఫ్రెండ్ పాత్ర‌లో.. వినోదాన్ని, చివ‌ర్లో ఉద్వేగాన్ని పంచి పెట్టాడు వైవా హ‌ర్ష‌. త‌ను ఇది వ‌ర‌క‌టిలానే కామెడీ నే చేసుంటే ఈ సినిమాలో హ‌ర్ష పాత్ర అంత‌గా గుర్తుండేది కాదు. కామెడీతో పాటు ఎమోష‌న్ నీ పండించాడు. అందుకే త‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. స‌రిగా వాడుకుంటే… వైవా హ‌ర్ష‌నీ త‌మ సినిమాల‌కు ప్ల‌స్‌పాయింట్ గా మార్చుకోవ‌చ్చ‌ని ద‌ర్శ‌కులు ఇప్పుడిప్పుడే న‌మ్ముతున్నారు. ఓ సినిమా హిట్ట‌యితే అవ‌కాశాలు రావ‌డం మామూలే. అయితే థియేట‌ర్లో విడుద‌ల కాని సినిమా వ‌ల్ల‌… ఓ న‌టుడి కెరీర్ టర్న్ అవుతోందిప్పుడు. అదే మ్యాజిక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close