విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మెట్రో సిటీగా మారనుంది. శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, మరియు ప్రభుత్వ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. పలు బడా సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తున్నాయి. మధురవాడ ఐటీ హబ్‌లు, విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు, హై-రైజ్ అపార్ట్మెంట్లు, విల్లాల డిమాండ్ బాగా పెరిగింది. రహదారుల విస్తరణ, ఐటీ పార్కులు, భోగాపురం విమానాశ్రయం సమీపంలో ఉండటం ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా చేస్తున్నాయి.
ఐటీ హబ్‌లు మరియు విద్యా సంస్థలకు సమీపంలో ఉండటం వల్ల యెండాడలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. ఐటీ పార్కులు, బీచ్‌ఫ్రంట్ లొకేషన్, లగ్జరీ హౌసింగ్ ఆప్షన్ల వల్ల రుషికొండ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారుతోంది. ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు , ఎన్ఆర్ఐలకు ఆకర్షణీయంగా ఉంది. ఒకప్పుడు శివారు పట్టణంగా ఉన్న దువ్వాడ ఇప్పుడు విశాఖలో కలిసిపోయిదంి. ల రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతోంది. 2 BHK అపార్ట్మెంట్లు , విల్లాలకు డిమాండ్ పెరుగుతోంది.
పెందుర్తి విశాఖపట్నం శివారులో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉంది. ఇక్కడ సరసమైన ధరల్లో ఓపెన్ ప్లాట్లు , గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. విశాఖపట్నం విస్తరణ జోన్లో భాగంగా, కొత్తవలస MSME పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఇక్కడ సరసమైన ధరల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఉండటం వల్ల, కుర్మన్నపాలెంలో తక్కువ బడ్జెట్ ఫ్లాట్లు మరియు ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతం పారిశ్రామిక ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.
ఐటీ పరిశ్రమల అభివృద్ధి , మధురవాడకు సామీప్యత వల్ల కూర్మన్నపాలెంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతోంది. సరసమైన రెసిడెన్షియల్ ఆప్షన్లు మరియు విశాఖపట్నంతో మెరుగైన కనెక్టివిటీ వల్ల కొమ్మాడిలో పెట్టుబడి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
మధురవాడ, భీమిలి, యెండాడ, రుషికొండ, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, కుర్మన్నపాలెం, పరదేశిపాలెం, కొమ్మాడి విశాఖపట్నంలో డిమాండ్ పెరుగుతున్న శివారు ప్రాంతాలుగా ఉన్నాయి.