వెంకీ ఇంట్లో పెళ్లి.. కొంత‌మందికే ఆహ్వానం

ద‌గ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సంద‌డి మొద‌లైంది. వెంక‌టేష్ కుమార్తె ద‌గ్గుబాటి అష్రిత కు పెళ్లి నిశ్చ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ రేస్ క్ల‌బ్‌కి అధిప‌తి అయిన ఆర్‌.సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వ‌డిని వెంక‌టేష్ అల్లుడ్ని చేసుకోబోతున్నాడు. ఈవారంలోనే రాజ‌స్థాన్‌లో పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి ద‌గ్గుబాటి కుటుంబానికి చెందిన అత్యంత స‌న్నిఃహితులు, టాలీవుడ్‌లోని కొంత‌మంది ముఖ్య‌మైన సెల‌బ్రెటీల‌కు మాత్ర‌మే ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాజ‌స్థాన్‌లో వివాహ ముంద‌స్తు వేడుక‌లు మొద‌లైపోయిన‌ట్టు తెలుస్తోంది. సంగీత్ కోసం రానా, నాగ‌చైత‌న్య‌, స‌మంత హంగామా చేయ‌డానికి ప్రిపేర్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన వ్య‌వ‌హారాలు మీడియాకు పొక్క‌కుండా ద‌గ్గుబాటి కుటుంబం అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంది. నిశ్చితార్థం కూడా గ‌ప్ చుప్‌గా జ‌రిగిపోయింది. అందుకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బ‌య‌ట‌కు రాలేదు. పెళ్లి తంతూ అలానే ముగించాల‌ని భావిస్తోంది. పెళ్ల‌య్యాక హైద‌రాబాద్‌లో ఘ‌న‌మైన విందు ఇవ్వాల‌ని వెంక‌టేష్ భావిస్తున్నారు. ఈ విందుకు మాత్రం టాలీవుడ్‌, బాలీవుడ్ సెల‌బ్రెటీలంతా హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close