సౌరాజ్ : ఏపీ ప్రయోజనాలకు దూరంగా జగన్ రాజకీయం..!

భారతీయ జనతా పార్టీ టార్గెట్‌గా.. చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. అది ఢిల్లీ వరకే. కానీ ఏపీ దగ్గరకు వచ్చే సరి.. బీజేపీ స్థానంలోకి వైసీపీ వచ్చింది. నేరుగా వైసీపీని అనాల్సిన పని లేదు. కానీ..అందరూ వైసీపీ వైపు అనుమానంగా చూసేలా మాత్రం చేయగలుగుతున్నారు. ఏపీపై మాట్లాడలేకపోవడం, బీజేపీకి మద్దతుగా ఉండటం.. వంటి అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించలేని పరిస్థితుల్లో ఉంది.

ఏపీ కన్నా మోడీనే జగన్‌కు ఎక్కువా..?

బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఏం జరుగుతుందో.. రాబర్ట్ వాద్రా వ్యవహారం దగ్గర్నుంచి బెంగాల్ లో సీబీఐ హడావుడి వరకూ అన్నీ కళ్ల ముందే కనబడుతున్నాయి కాబట్టి… నోరు మెదిపే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే.. అంతో .. ఇంతో.. బీజేపీకి మద్దతుగా మాట్లాడాలి. అందుకే ఏపీ ప్రయోజనాల విషయంలో.. చంద్రబాబుపై రివర్స్ విమర్శుల చేస్తూ… బీజేపీకి సానుకూలంగా ప్రకటనలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ఏపీకి వచ్చారు.. వెళ్లారు. ఆయన విభజన హామీలపై ాట్లాడతారేమోనని.. ప్రజలంతా ఎదురు చూశారు. కానీ..మోడీ కేవలం చంద్రబాబును తిట్టి… ఏపీకి కావాల్సివన్నీ ఇస్తామని నోటిమాటగా చెప్పి పోయారు. కానీ రైల్వేజోన్ నుంచి ప్రత్యేకహోదా వరకు ఎలాంటి హామీలపైనాప్రకటన చేయలేదు. దీనిపై.. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూంటే… వైసీపీ నేతలు మాత్రం.. దీని గురించి స్పందించడం లేదు. మోడీ గౌరవానికి భంగం వాటిల్లుతోందంటూ.. వారు బాధపడిపోతున్నారు.

బయట ఉంటే రాజకీయాలు చేసుకోవచ్చనే ఆశనా..?

ప్రధాని పర్యటనకు ముందు ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. . చంద్రబాబు దీక్ష, ఆ దీక్ష, సమయంలో చేసిన ప్రకటనతో.. స్పందించక తప్పలేదు. కానీ… ఏం మాట్లాడినా.. ఇరుక్కుపోయే పరిస్థితిని చంద్రబాబు సృష్టించారు. దాంతో… ఎంత తక్కువ నష్టం ఏ ప్రకటన చేస్తుందో.. దాన్ని ఎందుకున్నారు. నరేంద్రమోదీకి మద్దతుగా నిలిచారు. ఏపీ ప్రయోజనాల విషయంలో.. ఎలాంటి ప్రకటన చేయకపోయినా… వెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చిన నష్టమేం లేదు. ప్రజలు ఏమనుకుంటారనే భావన ఆ పార్టీకి లేదు. సొంత రాష్ట్రాన్ని పట్టించుకోకపోతే ప్రజలు దూరం పెడతారనే ఆలోచన వారు ఎప్పుడూ చేయలేదు. అలా చేసి ఉంటే.. మొదటి నుంచి బీజేపీని వ్యతిరేకించేవారు. కానీ.. వారి తక్షణ కర్తవ్యం వేరు. ముందుగా రాజకీయాల్లో కొనసాగాలంటే.. రాజీ పడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ముందుగా.. ఆ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశాన్ని మరోసారి చంద్రబాబు బలంగా.. ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఢిల్లీ దీక్షతో పాటు.. అక్కడ… ఏపీ ప్రయోజనాల కోసం కలసి రావాలని ప్రకటించి.. వైసీపీని పూర్తి డిఫెన్స్ లో పడేశారు.

ప్రజలకు ఏం సమాధానం చెబుతారు..?

మోదీపై .. పూర్తి సానుకూల స్పందనతో… వైసీపీ చేసిన ప్రకటనతో.. ఆ పార్టీ పూర్తిగా కార్నర్ అయిపోయినట్లయింది. ఆంధ్రప్రదేశ్ కు… బీజేపీ దారుణంగా అన్యాయం చేసినప్పటికీ.. వైసీపీ.. నేతలు మాత్రం.. ఆ పార్టీకే మద్దతు తెలియచేస్తున్నారు. ఏపీ కి ఇచ్చిన హామీలపై నోరు మెదపడం లేదు. కానీ.. టీడీపీనే.. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉందని.. ఎదురు దాడి చేస్తున్నారు కానీ.. ఇప్పుడు పోరాడే విషయంలో వైసీపీ నేతలు…. ఇంకేదో ప్రయోజనం చూసుకుంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడేలా చేసేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close