జగన్ కనిపించుట లేదు..! అభ్యర్థుల గగ్గోలు..!

ఎన్నికలు జరిగి నెల దాటిపోయింది. ఒక్క సమీక్ష లేదు. ఒక్క మీటింగ్ లేదు. కనీసం పోలింగ్ ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ గెలుస్తున్నాం.. గెలుస్తున్నాం అంటూ హడావుడి జరిగిపోతోంది. ఎన్నికల్లో ఏం జరిగిందో.. జగన్‌కు ఒక్క సారి మొర పెట్టుకుందామనుకున్నా.. ఆయన అవకాశం ఇవ్వడం లేదు. సినిమాహీరోల ఇళ్ల వద్దకు.. అభిమానులు వెళ్లినప్పుడు… ఇంట్లో లేరు అని ఎలా చెప్పిస్తారో.. అభ్యర్థులు వెళ్లినప్పుడు… జగన్ కూడా.. అలానే చెప్పిస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

వైసీపీ కేరాఫ్ విజయసాయిరెడ్డి..!

ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ ముగిసింది. ఆ రోజు రాత్రి… హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌ నుంచి బయటకు వచ్చి చిన్న మీడియా సమావేశం పెట్టారు జగన్. కొంత సేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత విశాఖలో బొత్స సోదరుడి కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. మరో సారి… ఫొని తుపాను బీభత్సం సృష్టిస్తున్న సమయంలో… హైదరాబాద్‌లో అవెంజర్స్ సినిమా చూశారు. అంతే.. ఇక బయట కనిపించడం లేదు. కనిపించడమే కాదు.. అసలు లోటస్‌పాండ్‌లో ఎవరితోనూ సమావేశం కావడం లేదు. పార్టీ నేతలు ఎవరు వెళ్లినా… విజయసాయిరెడ్డే ఎదురొస్తున్నారు. జగన్ లేరని చెప్పి.. మాట్లాడి పంపిస్తున్నారు. ఎవరు వెళ్లినా పార్టీలో నెంబర్ వన్ దర్శనం మాత్రం కావడం లేదు. అన్నింటినీ నెంబర్ టూ మాత్రమే… అడ్రస్‌గా మారారు.

జగన్ విహారంపై అంత గోప్యత ఎందుకో..?

జగన్ విహారయాత్రలపై పూర్తి స్థాయిలో గోప్యత పాటిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత వారం రోజులు ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారన్న ప్రచారం జరిగింది. కానీ కోర్టు పర్మిషన్లు ఇవ్వలేదన్న విషయం బయటకు వచ్చిన తర్వాత… ఆయన చండీగఢ్‌లోని ఓ రిసార్టులో రెస్ట్ తీసుకున్నారని చెప్పుకున్నారు. ఇవన్నీ అనధికారికమే. ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత లండన్ వెళ్లబోతున్నారని చెప్పారు. కానీ చివరి నిమిషంలో దాన్నీ రద్దు చేసుకున్నారని ప్రకటించేశారు. అయినా ఆయన లోటస్‌పాండ్‌లో లేరనే సమాధానమే వస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారేమోనని.. చాలా మంది అనుకున్నారు కానీ… సీనియర్లు వెళ్లినా.. ముఖం కూడా చూపించడం లేదు. విహారయాత్రలో ఉన్నారనే సమాచారాన్ని పంపుతున్నారు. మే16న కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కూడా.. జగన్ రావడం లేదు. విజయసాయిరెడ్డే నడపనున్నారు. ఎన్నికల ఫలితాలను కూడా లోటస్‌పాండ్‌లోనే చూడబోతున్నారని.. వైసీపీలోని ఉన్నత స్థాయి వర్గాలు నేరుగానే చెబుతున్నాయి.

ఊహాలోకంలో వైసీపీ.. కార్యాచరణలో టీడీపీ..!

ఏపీలో ఎన్నికల సమరం ముగిసిన తర్వాత టీడీపీ అధినేత దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈవీఎంలని.. వీవీ ప్యాట్లన్నీ.. ఏదో పని పెట్టుకుని తిరుగుతున్నారు. మధ్యలో ఇతర పార్టీలకు ప్రచారం చేస్తున్నారు. మళ్లీ పార్లమెంటరీ వారీగా సమీక్షలు జరిపి… కొత్త ప్రభుత్వం రాగానే జరగనున్న పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఓ వైపు… తాము అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో…వైసీపీ నేతలు పూర్తి రిలాక్స్ అయిపోయారు. ఓ రంగా… విజయసాయిరెడ్డి రెండు మూడు ట్వీట్లు, ఇతర నేతలు.. కాబోయే మంత్రుల ప్రకటనలు, తాము వచ్చిన తర్వాత దున్నేస్తామని చోటామోటా నేతల బెదిరింపులతో వైసీపీ టైంపాస్ చేస్తోంది. కానీ టీడీపీ అధినేత మాత్రం.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close