పెగసస్‌పై సుప్రీం విచారణకు ఆదేశిస్తే కేంద్రం సహకరిస్తుందా..?

దేశంలో పెగాసస్ నిఘాతో ప్రముఖులపై నిఘా పెట్టిన అంశంపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధం కాలేదు. కావాలంటే ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులతో కమిటీని నియమిస్తామని చెబుతోంది. కానీ సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. నిఘా పెట్టారా లేదా అన్నది చెప్పాలని లేకపోతే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని స్పష్టంచేసింది. ఇక మధ్యంతర ఉత్తర్వులు అంటే విచారణేనని భావిస్తున్నారు. ఎందుకంటే డీటైల్స్ చెప్పడానికి కేంద్రం నిరాకరిస్తోంది కాబట్టి ఆ డీటైల్స్ కనుక్కోవాలని సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థల్ని ఆదేశించడానికి అవకాశం ఉందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

పెగాసస్‌తో నిఘా పెట్టి తమ హక్కులకు భంగం కలిగించారని ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దశ భద్రత అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. కానీ అయితే దేశ భద్రత అంశంలోకి వెళ్లడంలేదని ప్రభుత్వం ఏమైనా స్పైవేర్‌ నిఘాను ఉపయోగించిందా లేదా అన్నదే చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ కేంద్రం చెప్పేందుకు సిద్ధపడకపోవడంతో సుప్రీంకోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులు ఎలా ఉంటాయన్న చర్చ ప్రారంభమయింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో రాహుల్ గాందీ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనా నిఘా పెట్టారని పలు వార్తలు బయటకు వచ్చాయి.

అదే సమయంలో గతంలో కేంద్రం ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి ప్రస్తావించింది. కానీ ఇప్పుడు మాత్రం అవి ఉపయోగించామా లేదా అన్నవాటిని చెప్పడం లేదు. పెగాసస్ స్పై వేర్ నిఘాకు గురైన వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉన్నారన్న ప్రచారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వమే సిద్ధంగా లేనప్పుడు.. సుప్రీంకోర్టు నేరుగా రంగంలోకి దిగి. విచారణకు ఆదేశించే పరిస్థితి ఉండదు. ఒక వేళ ఆదేశించినా ఆ దర్యాప్తునకు సరైన సహకారం లభించడం కష్టమవుతుంది. కేంద్రం అంగీకరిస్తేనే సుప్రీంకోర్టు అయినా విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విచారణ చేయించి నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కేంద్రంపైనే పడింది. తప్పించుకుంటే.. కేంద్రంపై మరిన్ని అనుమానాలు పెరుగుతాయి. దీనికి కేంద్రం సిద్ధమవుతోంది కానీ విచారణకు మాత్రం ససేమిరా అంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close