ఈటల అరెస్ట్ కూడా..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ విషయంలో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు.. ఈటలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడంతో పాటు.. త్వరలో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఈటల రాజేందర్ కూడా.. ఎన్ని రోజులు జైల్లో పెడతావని ఉదయం ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ను ప్రశ్నించారు. గతంలో పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పుడు.. తీసుకున్న నిర్ణయాలనూ వివాదాస్పదం చేసి కేసు పెట్టబోతున్నారని ఈటల అనుమానం వ్యక్తం చేశారు. ఈటల విషయాన్ని కేసీఆర్ చిన్న చిన్న చర్యలతో వదిలి పెట్టాలనుకోవడం లేదని.. ఆయన పూర్తిగా రాజకీయంగా ఎలాంటి అడుగులు ముందుకు వేయకుండా కట్టడి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని చెబుతున్నారు.

దేవరయాంజాల్ భూముల విషయంలో ఇప్పటికే విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ అలా ఆదేశాలు రాగానే.. ఇలా వెళ్లి విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎలాంటి నివేదిక కావాలంటే అలా.. నివేదిక సమర్పిస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే దేవరయాంజాల్ భూముల విషయాన్ని కదిలిస్తే.. అన్ని పార్టీల నేతల బండారం బయట పడుతుందని… రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ కొంత మందిపై చర్యలు తీసుకుని.. మిగతా వారిని పట్టించుకోకపోయినా భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని అంటున్నారు.

మరో వైపు ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పటి వ్యవహారాలుకూడా.. త్వరలో మీడియాలో ప్రముఖంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా… ఈటలపై పెద్ద ఎత్తున కేసులు పెట్టి.. అరెస్టుల వరకూ వ్యవహారం వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఈటల కూడా ఆషామాషీగా ఏం లేరని.. అన్నింటికి సిద్ధమయ్యే ఉన్నారని చెబుతున్నారు. ఆయన తన నియోజకవర్గం హుజూరాబాద్‌కు ఐదారు వందల కార్లతో ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా స్వాగత కార్యక్రమాలు జరిగాయి. హుజూరాబాద్ అనుచరులు హంగామా చేశారు. కార్యకర్తలతో చర్చల తర్వాత ఆయన కీలకమైన ప్రకటనలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కేసీఆర్ ఇంతగా పగ తీర్చుకోవడానికి అసలు ఈటల ఏం చేశారన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఆయన రాజకీయంగా కీలకమైన అడుగులు వేయడానికి… కేటీఆర్‌ను సీఎంగా చేయడానికి వ్యతిరేకత తెలియచేసిందుకే.., ఇలా చేస్తున్నారన్న చర్చ ప్రజల్లో ఉంది. దాని కోసమే అయితే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. కేసులు పెట్టి వేధించడం .. ఆస్తులపై దాడులు చేయడం ఏమిటన్న అభిప్రాయం సామాన్యుల్లో పెరిగే అవకాశం ఉంది. ఈటల-కేసీఆర్ మధ్య ఏం జరిగిందో అనేది ఇప్పుడు.. మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close