రెండురోజులుగా వల్లభనేని వంశీపై అదేపనిగా సానుభూతిని కురిపిస్తున్నారు. అనారోగ్యానికి గురయ్యారని, పూర్తిగా జుట్టు నెరిసిపోయి ఉందని ఆయన్ని అలా చూస్తుంటే జాలేస్తుందని వైసీపీ నేతలు తెగ ఫీల్ అవుతున్నారు. జగన్ చేత హీరో స్ట్రక్చర్ అని ప్రశంసలు అందుకున్నది ఈయనేనా అని వంశీ గెటప్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
వంశీ జైలుపాలై దాదాపు వందరోజులు కావొస్తోంది. దీనికి మూలకారణం ఆయనకూ తెలుసు. వైసీపీ హయాంలో జగన్ రెడ్డిని చూసుకొని రెచ్చిపోయారు.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. వంశీ జైలు పాలై కలలో కూడా ఊహించని వేదన అనుభవిస్తున్నా వైసీపీ నేతలు మినహా అయ్యో పాపం అనేవారు కరువయ్యారు.
ఒక కేసులో బెయిల్ వచ్చిందని సంబురపడేలోపు మరో కేసు వంశీని తగులుకుంటోంది. చేసిన నేరాలు, పాపాలు అలాంటివి మరి. అందుకే ఆయన బయటకు రాలేకపోతున్నారని అంటున్నారు. అయితే, వైసీపీ నేతల నుంచి సానుభూతి కురుస్తున్నా… అసలు బాధ్యుడు ఎక్కడా అనే టాక్ నడుస్తోంది.
జగన్ కళ్లలో ఆనందం కోసమే టీడీపీ ఆఫీస్ పై దాడులకు స్కెచ్ గీశారు వంశీ. ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించాడు. ఆ పాపం చుట్టేసుకొని జైలుపాలు కావడంతో ఓసారి వంశీని జైలుకు వెళ్లి చూసివచ్చిన జగన్…మళ్లీ అటువైపు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో వంశీ పట్ల వైసీపీ బాధ సరే… బాధ్యుడు ఏమైపోయాడు అని ఆ పార్టీలోనే డిస్కషన్స్ నడుస్తున్నాయి.