‘జెర్సీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

నాని సినిమాల్లో ‘జెర్సీ’కి ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ జోవియ‌ల్ క్యారెక్ట‌ర్స్ చేసిన నాని… తొలిసారి ఓ బ‌రువైన పాత్ర పోషించాడు. ఓ బాబుకి తండ్రిలా న‌టించాడు. వ‌య‌సు రీత్యా కూడా పెద్ద పాత్రే అనుకోవాలి. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల ఎమోష‌న్ బ‌లంగా చూపించారు. అదే సినిమాకి ప్ల‌స్ అయ్యింది. ఇప్పుడు తండ్రీ కూతుర్ల అనుబంధం నేప‌థ్యంలో ఓ సినిమా ఎంచుకొన్నాడు నాని. త‌ను న‌టిస్తున్న 30వ చిత్రానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇటీవ‌లే వ‌చ్చింది. జ‌న‌వ‌రి 1 సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో తండ్రీ కూతుర్ల సంభాష‌ణ‌లు, వాళ్ల క్యూట్ మూమెంట్స్ హృద‌యానికి హ‌త్తుకొనేలా ఉన్నాయి. ఈక‌థ‌లో తండ్రీ కూతుర్ల ఎమోష‌న్ ఎంత బ‌లంగా ఉంటుందో … ఈ చిన్న వీడియోతోనే అర్థ‌మైపోతోంది. గ‌డ్డం తీసేస్తా.. మీసం తీసేస్తా.. అంటూ చెప్పేసి, ఈ సినిమాలో త‌న గెట‌ప్ కూడా కొత్త‌గా ఉంటుంద‌న్న హింట్ ఇచ్చేశాడు నాని. పాప సెంటిమెంట్ తో వ‌చ్చిన ఏ సినిమా… దాదాపు నిరాశ ప‌ర‌చ‌లేదు. దానికి హిట్ రేషియో ఎక్కువే. పైగా సెంటిమెంట్ సినిమాతో ఇది వ‌ర‌కే హిట్ కొట్టాడు నాని. సో… ఈసారి కూడా `జెర్సీ` మ్యాజిక్ రిపీట్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.చూద్దాం.. ఏమ‌వుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.