త‌మ‌న్నానే భ‌య‌పెడుతోంది

శుక్ర‌వారం విడుద‌ల కాబోతున్న ఊపిరి చిత్రానికి అన్నీ శుభ‌శ‌కున‌ములే. ఊపిరికి పాజిటీవ్ బ‌జ్ ఉంది. కార్తీ వ‌ల్ల‌.. త‌మిళంలో ఈ సినిమాకి క్రేజ్ పెరిగింది. పాట‌లు బాగున్నాయి. ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే ఫీల్ గుడ్ మూవీ చూడ‌బోతున్నామ‌న్న ఫీలింగ్ క‌లుగుతోంది. పైపెచ్చు.. ఊపిరికి పోటీనే లేదు. నిల‌బ‌డిందంటే.. కోట్లు కొల్ల‌కొట్ట‌డం ఖాయం. ఇన్ని ప్ల‌స్సులు ఉన్నా, ఓకే ఒక్క మైన‌స్ ఈ చిత్రబృందాన్ని భ‌య‌పెడుతోంది. అదే త‌మ‌న్నా.

న‌టిగా, గ్లామ‌ర్ తార‌గా త‌మ‌న్నా ని త‌క్కువ చేయ‌లేం గానీ, ఆమెకు పెద్ద‌గా అదృష్టం క‌ల‌సిరాద‌న్న‌ది వాస్త‌వం. అగ్ర హీరోల‌తో త‌మ‌న్నా జ‌ట్టు క‌ట్టిన సినిమాల‌న్నీ ఫట్టే. ఊస‌ర‌వెల్లి, కెమెరామెన్ గంగ‌తో రాంబాబు, రెబ‌ల్‌, ఆగ‌డు.. ఇలా చాలా ఉదాహ‌ర‌ణ‌లే క‌నిపిస్తాయి. ఇన్ని సినిమాలు చేసినా, ఇంత క్రేజ్ ఉన్నా త‌మ‌న్నా నెంబ‌ర్ 1 రేసులోకి ఇప్ప‌టికీ రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదే. ఇప్పుడు ఊపిరికీ త‌మ‌న్నానే ఐరెన్ లెగ్‌గా మారుతుందేమో అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకీ అదే సీన్ రిపీట్ అయితే త‌మ‌న్నాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర మ‌రింత బ‌లంగా నాటుకుపోవ‌డం ఖాయం. త‌మ‌న్నా కూడా అదే విష‌యంలో భ‌య‌ప‌డుతోంద‌ట‌. ఈ సినిమా ఎలాగైనా హిట్ట‌యి.. అప‌ప్ర‌ద తొల‌గించాల‌ని కోరుకొంటోంద‌ట‌. అదే జ‌రిగితే, అంత‌కంటే కావాల్సింది ఏముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close