క్రెడిట్ చోరీ కోసం జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్దాలు చెప్పేస్తున్నారు. రెన్యూపవర్ తో పాటు బ్రూక్ ఫీల్డ్ ఫండ్ పెట్టుబడులు కూడా జగన్ హయాంలో వచ్చాయంటూ ఆయా కంపెనీల ప్రతినిధులతో దిగిన ఫోటోలను వైసీపీ సోషల్ మీడియా పోస్టు చేస్తోంది. కానీ అవన్నీ జగన్ హయాంలో వస్తే ఏమయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఎందుకు వస్తున్నాయన్న చిన్న లాజిక్ ను వారు మరచిపోతున్నారు. కాదు.. మర్చిపోయినట్లుగా నటించి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. నిజానికి ఆ పెట్టుబడులు జగన్ హయాంలో రాలేదు. చంద్రబాబు హయాంలో వస్తే.. కమిషన్లు ఇవ్వలేదని వాటిని తరిమేశారు. ఇప్పుడు ఆ కంపెనీలను మళ్లీ లోకేష్, చంద్రబాబు బతిమాలుకుని తీసుకు వస్తున్నారు. కానీ ఇక్కడ జగన్ తెచ్చాడని వైసీపీ నేతలు ఏ మాత్రం సిగ్గుపడకుండా ప్రచారం చేసుకుంటున్నారు.
రెన్యూపవర్ ..జగన్ తరిమేయకపోతే ఇప్పటికే పెట్టుబడుల గ్రౌండ్
రెన్యూపవర్ దాదాపుగా 80 వేల కోట్లు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందాలు చేసుకుంది. పీపీఏలు చేసుకుంది. అయితే జగన్ రెడ్డి గెలవగానే అవన్నీ చంద్రబాబు బినామీ కంపెనీలు అని రద్దు చేసేశారు. రెన్యూ పవర్ అప్పటికీ జగన్ ప్రభుత్వానికి ఉన్న డౌట్స్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించింది. కొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసింది. కానీ జగన్ ను సంతృప్తి పరచలేకపోయారు. ఫలితంగా పీపీఏలను కేంద్రం హెచ్చరిస్తున్నా సరే జగన్ రద్దు చేశారు. ఫలితంగా కోర్టు కేసులయ్యాయి. అయినా ఆ కంపెనీలు వెళ్లిపోయాయి. ఇప్పుడు మళ్లీ లోకేష్ వారితో సంప్రదింపులు జరిపి ఆ పెట్టుబడులు కొనసాగేలా చేశారు. అదే విషయాన్ని ట్వీట్లో చెప్పారు. 2019లో వెళ్లిపోయిన కంపెనీ మళ్లీ వస్తోందని చెప్పారు.
బ్రూక్ ఫీల్డ్ ఫండ్ కూడా జగన్ తెచ్చిందేనట..!
కెనడాకు చెందిన అంతర్జాతీయ ఫండ్ బ్రూక్ ఫీల్డ్ కూడా లక్ష కోట్లకుపైగా ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. దీన్ని కూడా మాజీ మంత్రి అమర్నాథ్.. యాక్సిస్ ఎనర్జీ అనే కంపెనీతోముడిపెట్టి.. తమ ఘనతే అని డప్పు వేసుకోవడం ప్రారంభించారు. ఇతర వైసీపీ సోషల్ మీడియా అదే పనిచేస్తోంది. నిజానికిఈ యాక్సిస్ ఎనర్జీ కూడా టీడీపీ హయాంలోనే ఏపీకి వచ్చింది. జగన్ రెడ్డి తరిమేసిన కంపెనీల్లో ఇదికూడా ఒకటి . ఆ తరవాత ఈ కంపెనీ.. బ్రూక్ ఫీల్డ్ ఫండింగ్ తో జత కట్టింది. ఇప్పుడు బ్రూక్ ఫీల్డ్ తో పాటు ఆ కంపెనీ కూడా వస్తోంది. తరిమేసిన కంపెనీ మళ్లీ వస్తోందంటే.. అదిమా ఘనతే అని గొప్పలు చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు.
ఆ పెట్టుబడుల్ని కొనసాగించి ఉంటే.. క్రెడిట్ దక్కేది కదా !
చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడుల్ని.. చేసుకున్న ఒప్పందాలను జాగ్రత్తగా చూసుకుని గ్రౌండ్ అయ్యేలా చేసుకుని ఉంటే క్రెడిట్ దక్కి ఉండేది. కానీ జాకీ డ్రాయర్ల కంపెనీ నుంచి అన్నింటినీ వెళ్లగొట్టారు. కమిషన్ ఇవ్వని ప్రతి కంపెనీని పొలిమేరల దాకా వెళ్లగొట్టారు. ఇప్పుడు ఆ కంపెనీలను మళ్లీ తీసుకు వస్తూంటే.. మేమే.. మేమే అని ముందుకు వస్తున్నారు. ప్రజాధనాన్ని ,ఆస్తులను దోచుకోవడంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసేందుకు అడ్డగోలు పద్దతులు, అబద్దాలతో ప్రయత్నిస్తున్నారు. వారు నిజంగా అంత ప్రతిభావంతులైతే.. ఐదేళ్ల పాటు ఏపీ ఎందుకు నిర్వీర్యం అయిపోయిందో ముందు వారు చెప్పాల్సి ఉంది.


