నిన్న విప్ ఈ రోజు క్యాన్సిల్..! ఇక శివసేన బీజేపీకి లేనట్లే..!!

భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం శివసేన గట్టి షాక్ ఇచ్చింది. నిన్న మీ వెంటే ఉంటామంటూ… హామీ ఇచ్చి ప్రధాని మోడీ, అమిత్ షాలను ప్రశాంతంగా నిద్రపోనిచ్చిన శివసేన… తెల్లవారేసరికి స్టాండ్ మార్చేసుకుంది. ఓటింగ్ కు దూరం ఉంటామని ప్రకటించింది. శివసేన దూరంగా ఉండటం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు కానీ… భవిష్యత్ రాజకీయాలపై మాత్రం తీవ్ర ప్రభావం చూపించనుంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలసి పోటీ చేసేది లేదని ఇప్పటికే నిర్ణయం తీసుకన్న శివసేన…అవిశ్వాసం విషయంలో కాస్తంత మెట్టు తగ్గినట్లు అనిపించింది.

దీంతో బీజేపీ వర్గాలు.. తమను శివసేన వీడిపోదని ప్రచారం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లోనూ మహారాష్ట్రాలో కలసి పోటీ చేస్తామన్నట్లుగా సంబరపడ్డాయి. కానీ ఆ ఆనందాన్ని ఉద్దవ్ థాకరే ఎక్కువ సేపు ఉండనీయలేదు. నిన్న విప్‌ పొరపాటుగా జారీ చేశామని, దాన్ని వెనక్కి తీసుకున్నామని పార్టీ సీనియర్‌ నేతలు ఉదయాన్నే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి పోరాటానికి మద్దతు తెలుపాలని కోరేందుకు.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివసేన చీఫ్ ను కలవాలనుకున్నారు. కానీ సమయం ఇవ్వలేదు. దాంతో బీజేపీవైపే శివసేన ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. కానీ తమ విధానం ఒంటరి పోరేనని మరోసారి స్పష్టం చేసినట్లయింది. బీజేపీ, శివసేన భావసారూప్యత ఉన్న పార్టీలు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత మహారాష్ట్రలో శివసేన క్యాడర్ ను… తమలో కలుపుకోవాలన్న ప్రయత్నం జరిగింది. దీంతో తమ పార్టీపై కుట్ర చేస్తున్నారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఎన్డీఏలో ఉన్నప్పటికీ…లేనట్లుగానే వ్యవహరిస్తోంది. మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మిత్రులందరూ దూరమవుతూండటంతో కొద్ది రోజులు క్రితం అమిత్ షా ప్రత్యేకంగా ముంబై వెళ్లి శివసేన చీఫ్ తో సమావేశయ్యారు. అయినా పరిస్థితులు మెరుగుపడలేదని తాజా నిర్ణయంతో తేటతెల్లమయింది. ఇది అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి వచ్చిన మొదటి షాక్ గా చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close