చైతన్య : ఏపీ పోలీసులంటే ఎందుకంత కసి జగన్..?

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అధికార పార్టీగా.. తన ప్రత్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే..ఎక్కువగా పోలీసుల్ని ద్వేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపైనే.. తన రాజకీయం చేస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీస్ కమిషనర్‌పై చేయి వేసి తోసి వేయడం దగ్గర్నుంచి మాత్రమే కాదు…వాళ్లేదో నరరూప రాక్షసులన్నట్లు… రైతుల్ని కొట్టి చంపుతారన్నట్లుగా ప్రచారం చేయించేస్తున్నారు. జగన్‌కు ఏపీ పోలీసులంటే.. అంత అలసు ఎందుకయ్యారు..?

ఏపీ పోలీసులపై ఎందుకు నమ్మకం ఉండదు..?

విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి జరిగింది. సహజంగా ఎవరైనా… వెంటనే.. పోలీసు కేసు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. చొక్కా మార్చుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ ఐసీయూలో చేరిపోయారు. హత్యాయత్నం అంటూ… కిందా మీదా పడిపోయారు. అది ఎలా సాధ్యమని… మనం లాజిక్కులు వెదుక్కోకూడదు కానీ.. పోలీసులపై వేసిన నిందలని మాత్రం ప్రశ్నించాల్సిందే. తన మీద హత్యాయత్నం అని.. ఊరు మీద పడి రచ్చ చేసే ముందు.. కనీస పౌరుడిగా.. కనీస బాధ్యతగా.. పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. కేసు పెట్టాలని… ప్రాథమిక సాక్ష్యాలు వారికి అందేలా చేయాలన్న విజ్ఞత ఉండదా..? స్టేట్‌మెంట్ తీసుకుందామని.. ఏపీ పోలీసులు వస్తే.. నమ్మకం లేదని.. .తెలంగాణ పోలీసులకైతే ఇస్తామని చెబుతారా..? . ఓ వ్యవస్థపై ప్రతిపక్ష నేతకు ఉన్న విశ్వాసం అదేనా..?. వైఎస్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉన్నారు. వారెవరూ.. వ్యవస్థపైనే నమ్మకం లేదని చెప్పలేదే..? . అదే పనిగా.. పోలీసులపై నమ్మకం లేదని.. కోర్టుల్లో స్టేట్‌మెంట్లు ఇచ్చి… ఎందుకు అంత వ్యతిరేకత ప్రదర్శించాల్సి వచ్చింది. పోలీసులు బయటపెట్టలేని గుట్టును ఎన్‌ఐఏ ఏమి తేల్చింది..?

పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తారా..? నరరూప రాక్షసులుగా ముద్రవేస్తారా..?

పోలీసులు కఠినంగా ఉంటారనే పేరు ఉంది కానీ… ఉత్తి పుణ్యానికే కొట్టి చంపేస్తారని.. ఏపీ పోలీసులపై ముద్ర వేయడం ఎందుకు..?. గుంటూరు జిల్లాలో కొండవీడులో జరిగిన కోటయ్య ఆత్మహత్య కేసు.. మొత్తాన్ని పోలీసులపై నెట్టేందుకు ఎందుకు ప్రయత్నించారు. పోలీసులే కొట్టి చంపారంటూ.. విస్త్రతంగా ప్రచారం చేయడం ఎందుకు..? పురుగు మందు తాగారని.. ఆయనను కాపాడటానికి.. పోలీసులు ప్రయత్నించారనేది.. దృశ్యాలతో సహా ఉన్న ఆధారాలు. కానీ.. పోలీసులే కొట్టి చంపారంటూ.. అంతులేని విద్వేషాన్ని ప్రజల్లో పోలీసులపై నింపడానికి ప్రయత్నించడం ఎందుకు..?. పోలీసులు కూడా మనుషులే. వారేమీ.. నర రూప రాక్షసులు కాదు. తమ మాట వినలేదని.. అలా కొట్టి చంపేస్తారా..?. అదీ కూడా.. వారు ఏపీ పోలీసులు కావడమే వారు చేసిన నేరమా..? . అంతా చూస్తూంటే.. కావాలనే పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే దారుణమైన కుట్రకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టం కావడం లేదా..?

పోలీసులపైనా కులం ముద్ర వేసేస్తారా..?

ఓ వైపు పోలీసులపై నమ్మకం లేదంటారు.. మరో వైపు.. వారిని నరరూప రాక్షసులుగా చిత్రీకరించి.. వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూంటారు…మరో వైపు… వారిలో కులం పేరుతో చిచ్చు పెట్టేందుకు కూడా వెనుకాడరు. డీఎస్పీలు అంతా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే ఉన్నారని.. పోలీసులంతా… చంద్రబాబు సామాజికవర్గం వారేనని ప్రచారం చేయడం ఎందుకు..? వాస్తవాలు తెలిసి కూడా.. కావాలని పోలీసులపై కులం ముద్ర వేసి.. వారిపై ఒత్తిడి పెంచాలని ఎందుకు అనుకుంటున్నారు..? పోలీసుల్లో అన్ని సామాజికవర్గాల వారూ ఉంటారు. అంత ఎందుకు.. చంద్రబాబు సామాజికవర్గం కన్నా… జగన్ సామాజికవర్గం వారే.. ఎక్కువగా డీఎస్పీ ప్రమోషన్లు పొందారని… అధికారికంగా… పోలీసు శాఖ ప్రకటించింది. మరి దానిపై ఎందుకు స్పందించడం లేదు. ఫలానా చోట… చంద్రబాబు సామాజికవర్గ అధికారి ఉన్నారని రచ్చ చేయడం ఎందుకు..? వారు ఉద్యోగాలు కూడా చేయకూడదా..? వారు విధుల్లో ఉంటే… చంద్రబాబుకు అనుకూలంగా ఉంటారా..?. పోలీసులపై ఇలా కులం ముద్ర వేసి.. వారిపై ఎందుకంత వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు..?

అధికారంలోకి వస్తే అంతు చూస్తామని బెదిరించేస్తారా..?

ఇది కోడికత్తి కేసు కాదు… అంతకు ముందు కూడా… జగన్‌కు.. విశాఖ విమానాశ్రయంలో.. విధ్వంసకర అనుబంధం ఉంది. ఓ రిపబ్లిక్ డే రోజున.. విశాఖలో ధర్నా కోసం… ప్రత్యేకహోదా ఉద్యమం పేరుతో… హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో వచ్చారు. పెట్టుబడల సదస్సు నేపధ్యంలో పోలీసులు స్పష్టమైన ఆంక్షలు విధించడంతో.. జగన్‌ను విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో.. జగన్ చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. విశాఖ పోలీస్ కమిషనర్‌ను భుజంపై చేయి వేసి.. తోసి… మీ అంతు చూస్తా… అని బెదిరించారు. సీఎంనే.. అడ్డుకుంటారా.. అని చెలరేగిపోయారు. ఆయన వంధిమాగధుల హడావుడి అంతా ఇంతా కాదు. ఏం చేసినా పోలీసులు మాత్రం ఆవేశ పడకుండా… సర్దిచెప్పి వెనక్కి పంపేశారు. పోలీసులపై… ప్రతిపక్ష నేతకు ఎంత గౌరవం ఉందో ఆ ఘటనతోనే బయట పడిపోయింది.

జగన్‌ గారూ..! వ్యవస్థలను కాపాడితే.. అవి మనల్ని కాపాడతాయి…!

రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. ఎవరికీ.. అధికారం శాశ్వతం కాదు. కానీ వ్యవస్థలు శాశ్వతం. పోలీసు వ్యవస్థ కూడా అంతే. ప్రజలకు రక్షణ కల్పించడమే వారి విధి. చట్టాలకు లోబడే.. వారి విధులు ఉంటాయి. చట్టాలను ఉల్లంఘిస్తే.. వారిపై చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలున్నాయి. ఈ వ్యవస్థల ఔన్నత్యాన్ని మనం కాపాడితే… ఆ తర్వాత అవి మనల్ని కాపాడతాయి.. వాటిపైనే… రాజకీయ అవసరాల కోసం ఓ రకమైన దాడి చేస్తే..ఆ తర్వాత మనల్ని కాపాడటానికి ఆ వ్యవస్థలు అప్పటికి మిగిలి ఉండకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close