వైసీపీ క్యాడర్‌లో ఇంత ఆనందమా !?

టీడీపీ గెలిచినందుకు టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. విచిత్రంగా వైసీపీ ఓడిపోయినందున వైసీపీ క్యాడర్ కూడా సంబరాలు చేసుకున్నారు. కాకపోతే బయటకు కాదు. సోషల్ మీడియాలో తమ సంబరాన్ని చాలా మంది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎంతో కష్టపడితే అధికారంలోకి వచ్చాక కనీసం పట్టిచుకోవడం లేదన్న అసంతృప్తే. ఇప్పుడైనా తమను పట్టించుకుంటారన్న ఓ ఆనందం వైసీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ నేతలు , కార్యకర్తల్లో ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది. దీనికి కారణం వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో అసలు పార్టీ కార్యకర్తలకు విలువ లేకుండా పోవడమే. ద్వితీయ శ్రేణి నేతలు కూడా చిన్న పని కోసం అయినా వాలంటీర్ల వద్దకు వెళ్లాల్సిందే. ఇది వైసీపీ క్యాడర్‌లో అసంతృరప్తికి కారణం అయింది. ఇక ఓ మాదిరి స్థాయి నేతలు.. తాము పార్టీ కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నా.. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని అసంతృప్తికి గురవుతున్నారు.

కొంత మంది పనులు చేసినప్పటికీ బిల్లులు అందడం లేదు. గ్రామాల్లో పంచాయతీల అధికారాలు మొత్తం గ్రామ సచివాలయాలకే ఉండటంతో వైసీపీ అధినాయకత్వంపై గ్రామ స్థాయి నాయకత్వం కూడా అసంతృప్తిగా ఉంది. అందుకే క్యాడర్ ను పట్టించుకోవాలన్న సందేశాలు ఎక్కువగా ఆ పార్టీ హైకమాండ్‌కు అందుతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ హైకమాండ్ పూర్తిగా ఐ ప్యాక్ మాయలో ఉందని.. ఎవరూ మార్చలేరన్న నిర్వేదం కూడా వారిలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close