వైఎస్ అండ్ కో కి సరదా తీరిందా?

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాల వరకే రాజకీయం పరిమితమైతే నాయకులకు కూడా కాస్తంత గౌరవం ఉండేది. కానీ ఓట్లు కొల్లగొట్టాలన్న ప్రయత్నంలో, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయాలన్న వ్యక్తిగత కక్ష్యలతో రాజకీయాలను భ్రష్టు పట్టించారు మన నాయకులు. రోజా, బోండా ఉమామహేశ్వరరావులాంటి వాళ్ళ గురించి అయితే చెప్పుకోవడమే అనవసరం. తెలంగాణా ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు కూడా దిగజారుడు వ్యాఖ్యల విషయంలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఈ విషయంలో టిడిపి, వైఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టులతో సహా ఎవ్వరూ ఎవరికీ తీసిపోరు.

అసలు విషయానికి వస్తే వైఎస్ రాజశేఖరరెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు, జగన్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వానదేవుడు-వైఎస్ కుటుంబీకుల మధ్య ఏదో జన్మజన్మల బంధం ఉందన్నట్టుగా ప్రచారం లేవదీశారు. చంద్రబాబు శారీరక లోపాన్ని కూడా ఎటకారం చేస్తూ కువిమర్శలు చేశారు. అందుకే చంద్రబాబునాయుడంటే వరుణ దేవుడికి కోపం అనే రేంజ్‌లో నోటికొచ్చినట్టుగా వాగేశారు. ఈ విషయంలో సాక్షి పేపర్ వాళ్ళు అయితే ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండేవారు. జగన్ పర్యటించిన ఊర్లో చిన్నపాటి తుప్పర్లు వచ్చినా ‘రాజన్న బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన వరుణదేవుడు’ అని తమకు తోచినట్టుగా భారీ ఎఫెక్ట్స్‌తోని వార్తలు వండివార్చి, వర్షాలను కూడా సెంటిమెంట్ కింద వాడేసుకుందామనుకున్నారు. మళ్ళీ ఈ సాక్షి పేపర్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే పివి సింధు, సత్యనాదెళ్ళలాంటి వాళ్ళ సక్సెస్‌ని చంద్రబాబునాయుడు తన అకౌంట్‌లో వేసుకోవడానికి తంటాలు పడుతున్నారని కామెడీగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్ కూడా నిజమే అయినప్పటికీ మరీ వర్షాలు కురవడాన్ని కూడా తమ ప్రతిభగా చెప్పుకోవాలని వైఎస్ అండ్ కో చేసిన ప్రయత్నాలు అయితే మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, ఆయన ఉన్న ఊర్లో ఏకంగా వర్షాల వరదే వచ్చేసింది. అందుకే ఇప్పుడు చాలా మంది సామాన్యులు కూడా వైఎస్ జగన్ అండ్ కో స్పందన ఏంటా అని ఎటకారంగా మాట్లాడుకుంటున్నారు. వరుణదేవుడు వైఎస్ ఫ్యామిలీకి హ్యాండ్ ఇచ్చేసినట్టేనా? నారావారి కుటుంబంతో బంధుత్వం కలుపుకున్నట్టేనా అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. టిడిపి నేతలు కూడా విమర్శలు స్టార్ట్ చేశారు. ఏవో డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే చెప్పలేం గానీ వైకాపా నేతల దగ్గర కౌంటర్ లేదన్న విషయం అందరికీ తెలిసిపోతూనే ఉంది. అందుకే ఒక్క వైఎస్ జగన్ అనే కాదు, చంద్రబాబు అయినా కెసీఆర్ అయినా… వాళ్ళు సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకుంటే గౌరవంగా ఉంటుంది. రాజకీయ నాయకులంటే కూడా ప్రజలకు కొంచెం మంచి అభిప్రాయం ఉంటుంది. అలా కాకుండా సత్యనాదెళ్ళ, వరుణ దేవుడు లాంటి వాళ్ళతో కామెడీ చేస్తామంటే మాత్రం ఇలాగే సరదా తీరిపోతూ ఉంటుంది. ఫైనల్‌గా ఆఫ్ స్క్రీన్ బ్రహ్మానందాలుగా చరిత్రలో నిలిచిపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close