వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరిస్తున్న పూడి శ్రీహరి అనే మాజీ జర్నలిస్టును చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆయన జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీపీఆర్వోగా వ్యవహరించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి నమ్మిన బంటు అయిన శ్రీహరి .. సజ్జల చెప్పే కుట్ర ధీయరీలు, ఫేక్ న్యూస్‌లు అన్నీ శ్రీహరి చేతుల మీటగానే సర్క్యూలేట్ చేసేవారు. ఇప్పుడే ఇదే ఆయన మెడకు చుట్టుకుంది.
తాడేపల్లిలోని శ్రీహరి నివాసంలో ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి గ్రాఫిక్ లు వేయడమే కాకుండా.. అన్ని నేరాలు ఆయనే చేయించినట్లుగా ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. ఈ మేరకు చిత్తూరులో కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. శ్రీహరిపై ఈ కేసు నమోదు అయినా ఐదు సంవత్సరాల పాటు టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా జరిగిన ఫేక్ నేరెటివ్స్ కు ఆయనే సూత్రధారి.
చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. రామోజీరావును ప్రశ్నించినప్పుడు లీక్ అయిన ఫోటోలు, వీడియోలు ఆయన ఫోన్, ల్యాప్ ట్యాప్‌ల నుంచే బయటకు వచ్చాయని అందరికీ తెలిసిన విషయం. అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుపై అత్యంత నీచంగా దేశద్రోహం ఆరోపణలతో ఫేక్ న్యూస్ ను మీడియాకు సర్క్యూలేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అయితే అవేమీ ఆయన సొంతంగా చేసినవి కావు. కేవలం సజ్జల చెప్పినట్లు చేశారు అంతే. అయితే ఇప్పుడు ఆయన బుక్కవుతున్నారు.
తాడేపల్లిలో ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఫోన్ , ల్యాప్ ట్యాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో విషయాలను బయటకు తీస్తే.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సజ్జల ఇచ్చిన ఆదేశాలన్నీ వెలుగులోకి వస్తాయి. వైసీపీకి సన్నిహితంగా ఉండే ఓ టీవీ చానల్ మహిళా జర్నలిస్టుతోనూ ఆయనకు వివాహేతర బంధం ఉండటంతో కుటుంబంలో కూడా సమస్యలు వచ్చాయి. అవన్నీ బయటపడే అవకాశం ఉంది.
