అందితే జుట్టు.. అందకపోతేకాళ్లు.. జగన్ రెడ్డి నైజం. ఎమ్మెల్సీల వియంలోనూ అదే. వాళ్లంతా చీకొట్టి వెళ్లిపోయారు. ఇతర పార్టీల్లో చేరి జగన్ రెడ్డి, వైసీపీని విమర్శిస్తున్నారు. అలాంటి వారిపై రోషం ఉన్న రాజకీయ నేత ఎవరైనా అనర్హతా వేటు కోసం సిఫారసు చేస్తారు. కానీ వాళ్లంతటకు వాళ్లు రాజీనామాలు మొహన కొట్టినా ఆమోదించడం లేదు. బలవంతంగా పదవుల్లో ఉండాల్సిందేనంటున్నారు. ఏ మాత్రం సిగ్గు లేకుండా..విలువల్లేకుండా వ్యవహరించడం వైసీపీకే సాధ్యమని పార్టీ వీడిపోయిన ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతోనే క్లారిటీ వస్తోంది.
వాళ్లు వేరే పార్టీలో చేరిపోయారు కదా!
వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరిన ఐదుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి, ఆ పత్రాలను మొహాన కొట్టినా వాటిని ఆమోదించకపోవడం వెనుక పెద్ద రాజకీయ కోణం కనిపిస్తోంది. సాధారణంగా ఏ పార్టీలోనైనా తమను ధిక్కరించి వెళ్లిన వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరతారు. కానీ వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా, వారు బలవంతంగా పదవుల్లోనే ఉండాలని, సాంకేతికంగా వైసీపీ ఎమ్మెల్సీలుగానే కొనసాగాలని కోరుకోవడం వెనుక సంఖ్యా బలం మాయాజాలం ఉంది.ఆ రాజీనామాలు ఆమోదిస్తే ఆ సీటు తమకు రాదని వారికి తెలుసు. అయితే రాకపోయినా ఇప్పుడు వాళ్లు వాళ్ల పార్టీలో లేరు.
విలువల ముసుగులో వింత రాజకీయం
రాజకీయాల్లో విలువలు, నైతికత గురించి మాట్లాడే జగన్ రెడ్డి.. తన పార్టీని విమర్శిస్తూ, ముఖ్యమంత్రిని దూషిస్తూ ఇతర పార్టీల్లో చేరిన వారిని ఏ అధికారంతో పార్టీలో కొనసాగుతున్నట్లు చూపిస్తారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సదరు ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను శాసనమండలి చైర్మన్‌కు పంపినా.. కారణాలు సంతృప్తికరంగా లేవని తిరస్కరించారు. ఇది వైసీపీ వ్యూహమే. రోషం ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా.. వద్దని వెళ్లిన వారి రాజీనామాలను వెంటనే ఆమోదింపజేస్తారని, కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
బలవంతపు బంధం వెనుక కారణాలు
మండలిలో తమకున్న మెజారిటీని కాపాడుకోవడం , ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయంతోనే రాజీనామాలను తిరస్కరిస్తున్నారు. రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోయిన వారి పదవుల్ని తీసేయడానికి కూడా వైసీపీ సాహసించకపోవడంతో ఆ పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. సిగ్గు, ఎగ్గు లేని ఇలాంటి రాజకీయాల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలు దిగజారిపోతున్నాయని, అధికార దాహం తప్ప ఆత్మగౌరవం అనే మాటకు వైసీపీ నిఘంటువులో చోటులేదని ప్రతిపక్షాలు విమర్శించడానికి ఇలాంటి రాజకీయాలే కారణం.
