ప్రతిపక్షం అంటే .. ఫేక్ ప్రచారం చేయడమే అని అనుకుంటున్నారు..వైసీపీ నేతలు, కార్యకర్తలు. ప్రభుత్వం ఏం చేసినా అందులో మంచి ఉందా లేదా అన్నది కాకుండా.. అడ్డగోలుగా ఫేక్ ప్రచారం చేసి.. ఏదో సాధిద్దామనుకుంటున్నారు . దానికి ఉచిత బస్సు పథకమే పెద్ద ఉదాహరణ. ఉచిత బస్సు పథకం ప్రారంభం కాక ముందే ఫేక్ యుద్ధం ప్రారంభించేశారు. ఎక్కడెక్కడి వీడియోలో తెచ్చి చూడండి.. ఉచిత బస్సు అని పెట్టారు కానీ ఎక్కించుకోవడం లేదని రచ్చ చేశారు.
వాటి గురించి బయటకు తెలియక ముందే ఏసీ బస్సుల్లో ఎందుకు ఫ్రీ లేదు.. పేదలు ఏసీ బస్సుల్లో వెళ్లకూడదా అన్న అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. టీటీడీకి చెందిన సప్తగిరి బస్సుల్లో ఎందుకు వెళ్లనివ్వరని మరో వాదన. సిక్కోలు నుంచి తిరుపతి వరకు ఉచిత బస్సు అమల్లో ఉంది. తిరుపతి నుంచి తిరుమలలో టీటీడీ అధీనంలో నడుస్తాయి. ఉచిత బస్సు పథకం విజయవంతమైతే.. తమ పరిస్థితి ఏమిటా అని వైసీపీ కిందా మీదా పడుతోంది గతంలో జగన్ కూడా ఉచిత బస్సు అమలు చేస్తే.. మహిళలు ఉచితంగా బస్సుల్లో వెళ్లి అమరావతి చూస్తారని సెటైర్లు వేశారు. ఇప్పుడు అది నిజం అవుతోంది.
ఉచితబస్సు పథకాన్ని ప్రారంభించి ఒక్క రోజు మాత్రమే అయింది. అందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరించుకుని పూర్తి స్థాయిలో ప్రజలకు .. మహిళలకు మెరుగైన సేవలు అందిస్తుంది. అందులో సందేహం లేదు. ప్రారంభించే ముందే పూర్తి కసరత్తు చేసి .. ప్రారంభమైన తర్వాత ప్రధానమైన సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతుంది. అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడుస్తూండటమే దీనికి ఉదాహరణ. వైసీపీ ఎంత ఆయాసపడినా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజలు అనుకుంటారు కానీ.. నిజంగా ఫ్రీ బస్సు పథకం విఫలమయిందని అనుకోరు.