నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని సీబీఐ సిట్ రిపోర్టు కూడా అదే చెప్పిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ అంశంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం నియమిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ప్రెస్‌మీట్ పెట్టారు.ఈ ప్రెస్‌మీట్ వైవీ సుబ్బారెడ్డి రక్షణాత్మక ధోరణిలో మాట్లాడారు.
నెయ్యిలో జంతు నెయ్యి కల్తీ కాలేదని..కానీ మామూలు కల్తీ జరిగి ఉండవచ్చన్నారు. సిట్ ఈ మేరకు నివేదిక ఇచ్చింది కాబట్టి బాధ్యులపై చర్యుల తీసుకోవాలన్నారు. తనపైనే ఆరోపణలు వస్తున్న విషయంపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. కల్తీ నెయ్యి విషయంలో తనకు ఏ పాపమూ తెలియదనన్నారు. అలా తెలిసి ఉంటే.. తాను ఎందుకు ల్యాబ్‌కు నెయ్యిని పంపుతానని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కేవలం తమపై రాజకీయ కక్ష సాధింపు కోసమేనని చెప్పుకొచ్చారు. సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే కొత్తగా ఏకసభ్య కమిటీని వేయడం ద్వారా అసలైన నిజాలను దాచిపెట్టి, కేవలం రాజకీయంగా తమను టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని అన్నారు. తాను ఎటువంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్ష కు కూడా తాను రెడీ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రసాదం కల్తీలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చిందని ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టాలని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఏకసభ్య కమిషన్ ఏర్పాటుతో.. అసలు సూత్రధారులు బయటకు వస్తారని వైసీసుబ్బారెడ్డి కంగారు పడుతున్నట్లుగా ఉంది. సుబ్బారెడ్డి ల్యాబ్ కు నెయ్యి పంపింది.. లంచాలు వసూలు చేయడానికేనని.. ఆ రిపోర్టు వచ్చినా లంచాలు తసుకుని తొక్కి పట్టారని సీబీఐ చెబుతోంది. అయితే ల్యాబ్ కు పంపడమే తన నిజాయితీ అన్నట్లుగా సుబ్బారెడ్డి ఉన్నారు. అసలు నెయ్యే కాని దాన్ని ఐదేళ్ల పాటు కొనుగోలు చేసి.. లంచాలు వసూలు చేసింది కాకుండా.. ఇప్పుడు తప్పించుకోవడానికి వీరు చేస్తున్న విన్యాసాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
