భేతాళుడిని ఆదుకొన్న జీ తెలుగు

బిచ్చ‌గాడు త‌ర‌వాత విజ‌య్ ఆంటోనీ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలు పెరిగిపోయాయి. అందుకే భేతాళుడు సినిమాపై దృష్టి పెట్టింది తెలుగు చిత్ర‌సీమ‌. బిచ్చ‌గాడు రైట్స్ రూ.40 ల‌క్ష‌ల‌కు కొంటే భేతాళుడు కోసం మాత్రం దాదాపు రెండు కోట్లు వెచ్చించారు నిర్మాత‌లు. అందులో విజ‌య్ ఆంటోనీ వాటా కూడా ఉంది. అయితే…. బిచ్చ‌గాడు స్థాయిలో భేతాళుడుకి ఆద‌ర‌ణ ద‌క్క‌డం లేదు. ఓపెనింగ్స్ బాగానే వ‌చ్చినా… దాన్ని నిల‌బెట్టుకోలేదు. ఈ సినిమాతో తెలుగు నిర్మాత‌ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వనుకొన్నారంతా. అయితే… భేతాళుడునీ, ఈ సినిమా కొన్న నిర్మాత‌ల్నీ జీ తెలుగు ఆదుకొంది. రూ.1.3 కోట్ల‌కు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు కైవ‌సం చేసుకొంది. దాంతో.. భేతాళుడు నిర్మాత‌లు ఒడ్డున‌ప‌డిన‌ట్టైంది.

ఈ సినిమా విడుద‌ల‌కు ముందే.. రైట్స్‌ని జీ తెలుగుకి క‌ట్ట‌బెట్టేశారు నిర్మాత‌లు. అందుకే… న‌ష్టాల నుంచి త‌ప్పించుకొనే ఛాన్స్ ద‌క్కింది. బిచ్చ‌గాడు సినిమాకి టీవీలో మంచి రేటింగే వ‌చ్చింది. భేతాళుడు మ‌రీ అంత బ్యాడ్ మూవీ కాక‌పోవ‌డం, విజ‌య్ ఆంటోనీకి క్రేజ్ ఉండ‌డంతో… జీ తెలుగు కూడా మంచి రేటుకే భేతాళుడిని ద‌క్కించుకొన్న‌ట్టైంది. ఈమ‌ధ్య స్ట్ర‌యిట్ సినిమాల్నీ, స్టార్ హీరోల సినిమాల్నీ కొన‌డానికి టీవీ ఛాన‌ళ్లు జంకుతున్నాయి. అలాంటిది విజ‌య్ సినిమానీ, అదీ ఓ డ‌బ్బింగ్ సినిమానీ విడుద‌ల‌కు ముందే కొనేయ‌డం విశేష‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ 30 ఫీట్ ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే !

తాడేపల్లిలోని జగన్ ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుది.. రెండు ఎకరాల చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప కచ్చడాలు కూడా ప్రజల సొమ్మే. వ్యూ కట్టర్స్ పేరుతో...

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

రీఎంట్రీకి శిశికళ రెడీ !

తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం,...
video

కల్కి.. సమయం చూడని సమరం

https://www.youtube.com/watch?v=5UfGZFrXKig మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించిన ఈ పాట... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close