పాక్‌కు చుక్కలు చూపించిన పసికూనలు!

భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ ఓడిపోయినందుకు తమ స్వదేశంలో రాబోయే విపరీతమైన వ్యతిరేకతకు సాకులు వెతుక్కుంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆటగాళ్లు చాలా మార్గాలు వెతుక్కున్నారు. సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ అయితే.. పిచ్‌ మీద అవగాహన రాలేదంటూ.. దాన్ని సాకుగా చూపి.. అందువల్ల ఓటమి పాలయ్యామని చెబుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్న నాట్యగత్తె సామెతను గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఇప్పటికీ ప్రపంచ దేశాల దృష్టిలో క్రికెట్‌ పసికూనలుగానే గుర్తింపు ఉన్న బంగ్లాదేశ్‌తో ఎదురైన ఓటమికి వారు ఎలాంటి సమాధానం చెప్పుకుంటారు? ఏం సాకులు వెతుక్కుంటారు. బంగ్లాదేశ్‌తో బుధవారం రాత్రి చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ దారుణంగా పరాజయం పాలైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ జట్టు 129 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. అయితే సెకండ్‌ బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయింది.

ప్రత్యేకించి.. విజయానికి బంగ్లాదేశ్‌ 26 పరుగుల దూరంలో ఉండగా.. పరుగు లేకుండా నియంత్రించాల్సిన బంతి మిస్‌ఫీల్డింగ్‌ కారణంగా ఫోర్‌ గా వెళ్లిపోవడం.. ఆ ఉత్సాహంలో బ్యాట్స్‌మెన్‌ తర్వాతి బంతిని కూడా ఫోర్‌గా మలచడం పాక్‌ను దెబ్బతీశాయి. 15 పరుగుల దూరంలో ఉండగా.. బ్యాట్స్‌మెన్‌ క్యాచ్‌ అవుట్‌ అయిన బంతి కాస్తా నోబాల్‌ కావడం పాక్‌కు ఒక శాపం అని చెప్పాలి.
అదే విధంగా విజయానికి 9 పరుగుల దూరంలో ఉండగా.. బ్యాట్స్‌మెన్‌ ఫోర్‌కు తరలించిన బంతి కూడా నోబాల్‌గా తయారై.. అదనపు పరుగును కూడా అందివ్వడం బంగ్లా దేశ్‌కు డబుల్‌ బొనాంజా అని చెప్పాలి.
ఈ పరిస్థితుల్లో చివరి ఓవర్లో 6 బంతులకు 3 పరుగులు చేయాల్సిన స్థితికి బంగ్లాదేశ్‌ చేరుకుంది. అలాంటి పరిస్థితిలో చివరి ఓవర్‌లో తొలి బంతిని ఒక అత్యద్భుతమైన సిక్సర్‌గా మలిచి బంగ్లా క్రికెటర్‌ మహ్మదుల్లా.. తమ దేశానికి ఒక తిరుగులేని విజయంతో అద్భుతమైన అనుభూతిని అందించాడు. దారుణమైన పరాజయం మూటగట్టుకున్న పాకిస్తాన్‌ ఈ ఓటమికి ఏం సాకులు వెతుక్కుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close