జనాన్ని భయపెట్టబోతున్న ‘జయప్రద’

పాప్ కార్న్ స్పోర్ట్స్ ఎంటర్ టైనెంట్స్ మరియు వి.ఎన్.వి ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా ఓ హారర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. నీరజ్ వాలా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు చీర్యాల లోని నరసింహస్వామి గుడి ప్రాంగణంలో జరిగింది.

ఈ సందర్భంగా నటిమణి జయప్రద మాట్లాడుతూ… “చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. డబ్బు మాలిక్, నీరజ్ వాలా, అర్మాన్ మల్లిక్ వంటి బాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయనుండడం సంతోషకరం. గతంలో సంగీతం విభాగంలో పలు ఫిలిం ఫేర్ అవార్డులతోపాటు, అసంఖ్యాక అభినందనలు అందుకొన్న అర్మాన్ మల్లిక్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహించనుండడం విశేషం. ఈ చిత్ర నిర్మాత బాలగిరి నాకు 25 సంవత్సరాలుగా తెలుసు, మంచి మిత్రులు. నేడు ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాతో నటింపజేయడం ఆనందంగా ఉంది. చీర్యాల చైర్మెన్ నర్సింహ్ గారు ఇక్కడకు విచ్చేసి మా చిత్ర బృందాన్ని అభినందించడం సంతోషంగా ఉంది. కామెడీకి ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని దర్శకుడు నీరజ్ వాలా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనుండడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

గాయకుడు అర్మాన్ మల్లిక్ మాట్లాడుతూ… “అద్భుతమైన ప్రతిభావంతులందరూ కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రంలో భాగస్వామిని అవ్వడం సంతోషంగా ఉంది. మా నాన్నగారు డబ్బు మాలిక్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి మా అన్నయ్య ఆమాల్ మాలిక్ సంగీతం సమకూర్చుతున్నారు” అన్నారు.

దర్శకుడు నీరజ్ వాలా మాట్లాడుతూ… “సీనియర్ నటీమణి జయప్రదగారు ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని రూపొందిస్తుండడం ఆనందంగా ఉంది. నర్సింహ స్వామి ఆశీస్సులు లభించి మా ఈ ప్రయత్నం ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close