ఇది మోహన్ లాల్ సాహో

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చాలా చిత్రమైన నటుడు. ఆయన చేసే సినిమాలు ఒకదానికీ మరోదానికీ పొంతన వుండదు. ఏ పాత్ర అయినా అందులో ఒదిగిపోతాడు. అందుకే మనమంతాలో మనకు మధ్యతరగతి మనిషిగా, జనతా గ్యారేజ్ లో ఓ పెద్దాయినగా, మన్యం పులిలో వీరోచిత వ్యక్తిగా ఎలా కనిపించినా జనాలు రిసీవ్ చేసుకున్నారు. ఈ మధ్య మోహన్ లాల్ బాగా వర్కవుట్లు చేసి, సన్నబడి మళ్లీ క్రేజీ క్యారెక్టర్ లు చేస్తున్నారు. వాటిల్లో ఒకటి ఇప్పుడు నిర్మాణంలో వున్న ‘డ్రామా’ సినిమా. పాపులర్ డైరక్టర్ రంజిత్ డైరక్షన్ లోతయారవుతున్న ఈ సినిమా టీజర్ రెండు రోజుల క్రితం బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మోహన్ లాల్ ఇంటర్నేషనల్ స్పై కింద కనిపించబోతున్నాడు. ఈ టీజర్ చూసిన వారందిరకీ ఒకటే అనుమానం. సాహో టీజర్ ను వీళ్లు చూసారా? లేక వీళ్లు ఇద్దరు కలిసి, ఏ హాలీవుడ్ సినిమానన్నా చూసారా? అన్నదే ఆ అనుమానం. సాహో టీజర్ లో కనిపించిన సీన్, ఈ డ్రామా టీజర్ లో కూడా కనిపించడం విశేషం. డ్రామా సినిమా కూడా సాహో మాదిరిగానే హాలీవుడ్ స్టాండర్స్ లో తయారవుతున్న స్పై యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా. మరి ఇటు సాహోకు , ఈ సినిమాకు ఏమైనా హాలీవుడ్ సినిమా ప్రేరణ వుందా అని టీజర్ బయటకు వచ్చాక అనుమానాలు కలుగుతున్నాయి. కావాలంటే యూ ట్యూబ్ లో మోహన్ లాల్ డ్రామా టీజర్ ను ఓ లుక్కేయండి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close