ఆ పార్టీల‌కు ముస్లింలు ఓట్లు వెయ్య‌ర‌న్న సీఎం..!

రాష్ట్రంలోని ఒక్క ముస్లిం ఓటు కూడా వేరే పార్టీకి ప‌డే ప‌రిస్థితి లేద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. గుంటూరులో జ‌రిగిన నారా హ‌మారా టీడీపీ హ‌మారా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ… ముస్లింల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపించారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో భారీ మ‌సీదు, ఇస్లామిక్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌ నిర్మిస్తామ‌న్నారు. రాయ‌ల‌సీమ‌లో కొన్ని జిల్లాలు త‌ర‌హాలోనే ఇక్క‌డ కూడా ఉర్దూని రెండో భాష చేస్తామ‌న్నారు. వీటితోపాటు యువ‌త ఉపాధికి, ఉద్యోగావ‌కాశాల‌కు సంబంధించిన డిమాండ్ల‌ను కూడా ప‌రిష్క‌రిస్తామన్నారు. వివిధ కార్య‌క్ర‌మాల‌కు నిధుల‌నూ మంజూరు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ప్ర‌తిప‌క్ష పార్టీతోపాటు భాజ‌పాను, ప‌వ‌న్ కూడా ఒకేగాట‌న క‌ట్టి చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వైకాపా ముస్లింల‌ను మోసం చేసింద‌న్నారు. అంద‌రి ఓట్లూ వేయించుకున్న జ‌గ‌న్‌, ఇప్పుడు కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం భాజ‌పాతో లాలూచీ ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ అంటూ మాట్లాడిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఆ త‌రువాత క‌నిపించే ప‌రిస్థితి లేకుండాపోయింద‌న్నారు. ఎన్డీయే ఓడిపోవాలంటే ప‌వ‌న్‌, జ‌గ‌న్ ల‌ను ఓడించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మైనారిటీల సంక్షేమం మొద‌లుకొని ప్ర‌త్యేక హోదా వ‌ర‌కూ తాము నిరంత‌రం పోరాటం చేస్తున్నామ‌న్నారు. కానీ, వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి, ఇంట్లో కూర్చున్నార‌ని ఎద్దేవా చేశారు.

మ‌త సామ‌ర‌స్యాన్ని మొద‌ట్నుంచీ కాపాడిన పార్టీ టీడీపీ అంటూ దివంగ‌త లాల్ జానా బాషాను గుర్తుచేశారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలను సీఎం వివ‌రించారు. కాశ్మీరులో ఆశిఫా ఉదంతానికి కార‌ణం ఎన్డీయే ప్ర‌భుత్వ‌మ‌న్నారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లులో అరెస్టు చేసే నిబంధ‌న‌ను తాము వ్య‌తిరేకించామ‌న్నారు. అబ్దుల్ క‌లామ్ ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించిన సంద‌ర్భాన్ని గుర్తు చేస్తూ… క‌లామ్ రాసిన పుస్త‌కంలో… ‘చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు ఫోన్ చేశార‌నీ, ప్ర‌ధాని వాజ్ పేయి ఫోన్ చేస్తార‌ని చెప్పార‌’నే వాక్యాల‌ను చ‌ద‌వి వినిపించారు. ముస్లింల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త క‌ల్పించిన పార్టీ తెలుగుదేశం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని సీఎం అన్నారు.

వైకాపా, జ‌న‌సేన‌, భాజ‌పా… ఈ మూడింటినీ ఒకేగాట‌న క‌ట్టి చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. వీటిలో ఏ పార్టీకి ఓటేసినా అది భాజ‌పాకే వెళ్తుంద‌న్న అభిప్రాయాన్ని వినిపించే ప్ర‌య‌త్నమూ బ‌లంగానే చేశారు..! మ‌త‌ప‌రంగా మ‌సీదూ, మ‌త పెద్ద‌ల‌కూ ప్రాధాన్య‌త ఇస్తూనే… సంక్షేమానికీ క‌ట్టుబ‌డి ఉన్న‌మనే చెప్పే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు ప్ర‌సంగంలో క‌నిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close