హైదరాబాద్‌కు ఈసీ కమిటీ..! ఎన్నికలకు సిద్ధమని నివేదిక ఖాయమేనా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరో తేదీన అసెంబ్లీని రద్దు చేశారు. అదే రోజున సాయంత్రం గెజిట్ వచ్చింది. ఈ రోజు పదకొండో తేదీ అంటే.. ఐదు రోజులు మాత్రమే మధ్యలో గడిచాయి. ఈ లోపు తెలంగాణ ఎన్నికలపై కేంద్రం ఎన్ని నిర్ణయాలు తీసుకుందో లెక్కే లేదు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ షెడ్యూల్‌ను సవరించడం దగ్గర్నుంచి… ఎన్నికల కమిషన్ బృందాన్ని తెలంగాణకు.. ఏర్పాట్లపై ప్రత్యక్షంగా సమీక్ష జరపడానికి పంపేవరకూ.. చాలా నిర్ణయాలు అఘమేఘాలపై తీసుకున్నారు. తాము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని.. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఢిల్లీ వెళ్లి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చే కమిటీ కూడా.. అదే నివేదికను మరో రూపంలో రెడీ చేసి.. ఈసీకి ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే.. అధికారికంగా.. నిర్వహించాల్సిన సమావేశాలు నిర్వహించక తప్పదు.

హైదరాబాద్ లో రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం బిజీ బిజీగా గడుపనుంది. 9 రాజకీయ పార్టీలు, పోలీస్ అధికారులు, కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సమావేశం లో ఎన్నికల నిర్వహణ , పోలింగ్ బూత్ లపై ఏర్పాటు పై క్లారిటీ తీసుకుంటారు. ఉమేష్ సిన్హా బృందం లో 9 మంది వివిధ అంశాలను అడిగి తెలుసుకోనున్నారు.. రేపు సాయంత్రం నుంచి మరుసటి రోజు రాత్రి వరకు అందరి అభిప్రాయాలను సేకరించి నివేదిక సిద్ధం చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే బడ్జెట్ లో 308 కోట్ల రూపాయలను కేటాయించారు. వారం లో అన్ని నియోజకవర్గాలకు ఈ వి ఎం లు పంపిణీ చేయనున్నారు..

సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు ఉమేష్ సిన్హా బృందం వస్తుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 వరకు 9 పొలిటికల్ పార్టీలతో సమావేశం అవుతారు. బుధవారం కూడా.. అధికారులతో సమీక్ష జరుపుతారు. మరో వైపు 2018 ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది 2018 మార్చిలో ప్రకటించిన ఓటర్ల జాబితాకు సవరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈనెల 25వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం. వచ్చే నెల 8వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

ఎలక్షన్ ఎజెండా డిసైడ్ చేసిన రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల...

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close