చంద్రబాబు, రామోజీ భేటీ ఎజెండా రాజకీయమేనా..?

“ఊరకనే వెళ్లరు మహానుభావులు..” అనే మాట ఏపీ రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చకు వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు… ఓ వైపు జాతీయ రాజకీయాలు..మరో వైపు.. కౌంటింగ్ ఎజెంట్లకు శిక్షణ..ఇంకో వైపు… స్వంతంగా కల్పించుకున్న ప్రభుత్వ వ్యవహారాలతో తీరిక లేకుండా ఉన్న సమయంలోనూ.. నేరుగా ఫిల్మ్ సిటీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. మూడు గంటల పాటు.. రామోజీరావు ఆతిధ్యాన్ని స్వీకరించేందుకు ప్రత్యేకంగా.. అమరావతి నుంచి హెలికాఫ్టర్‌లో… ఫిల్మ్ సిటీకి వెళ్లారు. మళ్లీ అక్కడ్నుంచి బయలుదేరి అమరావతికి చేరుకున్నారు. ఇంత బిజీలోనూ.. చంద్రబాబు.. రామోజీరావుతో చర్చల కోసం.. ఫిల్మ్ సిటికీ వెళ్లడమే… అనేక ఊహాగానాలకు కారణం అవుతోంది.

రామోజీతో చంద్రబాబు చర్చలు దేని కోసం..?

చంద్రబాబుకు రామోజీరావు రాజకీయ సలహాలు ఇస్తూ ఉంటారని.. బయట చెప్పుకుంటారు. అయితే.. చంద్రబాబే సలహాలిచ్చే స్థాయిలో ఉన్నారు కానీ… తీసుకోవడం ఏమిటన్నది.. కొంత మందికి సందేహం. సలహాలిస్తారా..? మీడియా ద్వారా సపోర్ట్ చేస్తారా..? అన్నది వేరే విషయం కానీ… ఇద్దరి మధ్య మాత్రం సుహృద్భావ సంబంధాలున్నాయన్నది మాత్రం అందరూ అంగీకరించే విషయం. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెట్టాలని సూచించింది… రామోజీరావేనని.. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. దాంతో నవ్యాంధ్ర రాజధాని పేరు క్రెడిట్‌ను.. ఆయనకు ఇచ్చేసినట్లయింది. ఆ తర్వాత కూడా.. ఆ బాండింగ్ అలా కొనసాగుతోందని… తాజా విందు భేటీతో తేలిపోయిందని.. రాజకీయవర్గాలకు ఓ క్లారిటీ వచ్చినట్లయింది.

జాతీయ రాజకీయాల వ్యూహాలపై చంద్రబాబు సలహాలు తీసుకున్నారా..?

ఎన్నికల ఫలితాలకు ముందు… రామోజీరావుతో.. అంత అత్యవసరంగా… చంద్రబాబు చర్చించాల్సిన విషయం ఏమిటన్నది.. ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏపీ కన్నా… ఇప్పుడు ఎక్కువగా… పెద్దల దృష్టి.. కేంద్ర రాజకీయాలపై ఉంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయమన్న ప్రచారం జరుగుతున్న సమయంలో… బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న రామోజీరావు.. ఆ దిశగా… ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా.. అన్న చర్చ కూడా ప్రారంభమయింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో.. మొదట.. ఈనాడు.. మోడీ సర్కార్‌కు.. హార్డ్ కోర్‌గా సపోర్ట్ చేసేది. తర్వాత తర్వాత తన పంధా మార్చుకున్నది. ఇటీవలి కాలంలో బీజేపీకి పూర్తి వ్యతిరేకతంగా ఈనాడు మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కోసం.. లాబీయింగ్ చేసే అవకాశం లేదన్న చర్చ కూడా నడుస్తోంది.

ఏపీలో ఎన్నికల ఫలితాలపై చర్చించారా..?

నిజానికి ఏపీలో ఎన్నికల ఫలితాలపై… చంద్రబాబు క్యాంప్‌లో ఎలాంటి ఆందోళన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేజారదన్న నమ్మకం కూడా ఉంది. చంద్రబాబు తాను చేయించిట్లు చెప్పుకుంటున్న నాలుగు సర్వేల్లో ఒకటి ఈనాడుది కూడా.. అన్న చర్చ… టీడీపీ వర్గాల్లో ఉంది. అందుకే.. ఏపీలో రాజకీయాలపై వారు ప్రత్యేకంగా భేటీ అయి చర్చించాల్సిన అవసరం లేదంటున్నారు. మరో వైపు… కొద్ది రోజుల కిందట.. రామోజీరావు .. తన మనవరాలు, చనిపోయిన సుమన్ కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. తానే స్వయంగా కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. చంద్రబాబు పెళ్లికి వెళ్లినప్పటికీ.. విందు ఆరగించలేదు. ఆ కారణంగా.. చంద్రబాబును.. కుటుంబసమేతంగా.. రామోజీ రావును విందుకు ఆహ్వానించారని.. ఇందులో రాజకీయమే లేదని.. కొంత మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు, రామోజీ భేటీ ఎజెండా రాజకీయమైనా, వ్యక్తిగతమైనా… బయటకు తెలిసే అవకాశం మాత్రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

బ‌న్నీ చేతిలో ‘గాజు గ్లాసు’… ఏం సంకేతాన్ని ఇస్తోంది?

సినిమా వాళ్లు, అందులోనూ స్టార్ హీరోలు సెన్సిటీవ్‌గా ఉంటారు. తెర‌పై ఏం చేసినా, చెయ్యాల‌నుకొన్నా, ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తారు. 'ఇలా చేస్తే.. జ‌నంలోకి ఎలాంటి సంకేతాలు అందుతాయి' అనే లెక్క‌లు వాళ్ల‌కు చాలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close