ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్యాంగ్ షూట్

రాజమౌళి-ఎన్టీఆర్-చరణ్ ల కాంబినేషన్ లో చకచకా రెడీ అవుతోంది ఆర్ఆర్ఆర్. అయితే సినిమా ఎంతవరకు వచ్చింది? ఏమిటి?అప్ డేట్ అన్నది అభిమానులకు కాస్త ఆసక్తి. వాళ్ల కోసమే ఈ వివరాలు.

ఆర్ఆర్ఆర్ ఇప్పటికి 40శాతం వరకు వర్క్ పూర్తయింది.ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ తీస్తున్నారు. 1500 మంది దేశీ, విదేశీ జూనియర్ అర్టిస్టుల నడుమ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు.

ఈ ఎపిసోడ్ చిత్రీకరణ అయిన తరవాత లోకల్ గానే ఓ పాట చిత్రీకరించి, యూనిట్ బల్గేరియా షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి వచ్చిన తరువాత మళ్లీ హైదరాబాద్ లో షూటింగ్ వుంటుంది. ఇది కాక, గుజరాత్, రాజస్థాన్, కేరళలో కూడా షెడ్యూళ్లు వున్నాయి.

ఇదిలావుంటే సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదు. ఆ హీరోయిన్ షూట్ పార్ట్ ఇప్పట్లో లేకపోవడంతో తొందరపడడం లేదు.సరైన విదేశీ నటి కోసం వేట అయితే కొనసాగుతోంది. సాయిపల్లవి అంటూ వచ్చినవి పక్కా ఫేక్ గ్యాసిప్ లు తప్ప వేరు కాదు. దట్సిట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

దటీజ్ పవన్ – ముద్రగడకు గౌరవం !

కుటుంబాల్లో చిచ్చు పెట్టడం వైసీపీ రాజకీయవ్యూహంలో ఒకటి. రామోజీరావు కుటుంబం నుంచి దేవినేని ఉమ కుటుంబం వరకూ ఎక్కడ చాన్స్ వచ్చినా వదిలి పెట్టలేదు. కానీ జనసేన చీఫ్ పవన్...

జగన్‌పై సీఐడీ కేసు పెట్టక తప్పదా !?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ...

ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close