మారుతి క‌థ‌లో రాజ్ త‌రుణ్‌

వ‌రుస ఫ్లాపుల‌తో డీలా ప‌డిన రాజ్ త‌రుణ్ కెరీర్ మెల్ల‌మెల్ల‌గా మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తోంది. ప్ర‌స్తుతం దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు రాజ్‌త‌రుణ్‌. ఇప్పుడు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. మారుతి రాసుకున్న క‌థ‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. మారుతి బ‌య‌ట సినిమాల‌కూ అప్పుడ‌ప్పుడూ క‌థ‌లు అందిస్తున్నాడు. వాటిలో సొంత బ్యాన‌ర్‌లో తీసేవే ఎక్కువ‌. మారుతి రాసిన క‌థ‌.. రాజ్‌త‌రుణ్‌కి బాగా సూట‌వుతుంద‌నిపించి – ఈ కాంబినేష‌న్ సెట్ చేశాడ‌ట మారుతి. కాక‌పోతే ఈ సినిమాకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం లేదు. మారుతి టాకీస్ లో ప‌నిచేసిన ఓ ద‌ర్శ‌కుడు ఈ సినిమాని టేక‌ప్ చేయ‌బోతున్నాడు. ఇదో స‌ర‌దా ల‌వ్ స్టోరీ అని, క‌థ‌లో గ‌మ్మ‌త్తైన మ‌లుపులు ఉంటాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close