జగన్‌కు ఆత్మహుతి దళంలా పని చేస్తామని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ విభిన్నంగా స్పందించారు. ఈ వారం తన కొత్త పలుకులో అహంకారం తలెక్కిన నేతలకు ప్రజలకు బుద్ది చెబుతారని ఎన్నికల్లో ఓడిపోయిన నేతలందరి పేర్లూ రాస్తూ చెప్పుకొచ్చారు. పనిలో పనిగా చివరిలో ఫినిషింగ్ టచ్‌గా జగన్ రెడ్డి దగ్గరకు దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలోన తాము జగన్ రెడ్డి ఏమి చెప్పినా సరే ఆత్మాహుతి దళంలా పని చేస్తామని మిథున్రెడ్డిఅన్న మాటలపై స్పందించారు.
రాజకీయాల్లోనూ ఉగ్రవాద భావజాలం తరహా పార్టీలు ఉంటాయని తెలిసిందని.. అయితే. ఉగ్రవాద సంస్థల ఆత్మాహుతి దళాలు ఏమీ సాధించకుండానే పిచ్చి చావులు చస్తూంటాయని గుర్తు చేశారు. మావిగన్‌పై ప్రజలు జోకులేస్తున్నా.. జగన్ రెడ్డి చెప్పారని అది అమరావతి కంటే గొప్పదన్నట్లుగా ప్రచారం చేయడం ఏమిటని .. కనీసం ఓ మాట అధినేతకు చెప్పే ధైర్యం కూడా లేదా అని ప్రశ్నించారు. మరో మాట.. ఫీడ్ బ్యాక్ వినే ఉద్దేశం లేని నాయకుడు ఎదగడం అనేది ఉండదని ఆర్కే స్పష్టం చేశారు. రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డికి ఇమేజ్ దారుణంగా పడిపోయిందని.. కావాలంటే వారే సర్వే కూడా చేసుకోవచ్చని ఆర్కే సలహా ఇచ్చారు.
పనిలో పనిగా వైసీపీ నేతల్ని గిల్లి వదిలి పెట్టారు. జగన్ రెడ్డి చెప్పాడని ఆంధ్రజ్యోతి ఆఫీసులపైకి..తనపైకి వచ్చిన వారు ఇప్పుడెందుకు సైలెంటుగా అయ్యారని ప్రశ్నించారు. తానేమీ వారు అడిగినట్లుగా క్షమాపణ చెప్పలేదు కదా అని కూడా ప్రశ్నించారు. వ్యక్తిత్వం లేని వాళ్లు నాయకులు ఎలా అవుతారని కూడా ఆర్కే ఈసడించారు . ఇప్పటికీ తెలుసుకోలేకపోతే ఎప్పటికీ మళ్లీ గెలవలేదని కూడా సలహా ఇచ్చారు. అదే సమయంలో దక్షిణాది పార్టీలు యాభై శాతం ఫార్ములాకు అంగీకరించకపోతే.. చాలా నష్టపోతాయని చంద్రబాబు చేసిన ట్వీట్ లోని అర్థాన్ని కూడా తన అభిప్రాయంగా ఇక్కడ వివరించారు.
ఈ వారం తన కథనంలో ప్రధానంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపైనే దృష్టి కేంద్రీకరించారు. మోదీ, షాలు ఏమీ చెప్పకుండా.. ఏదో చేయాలనుకుని బోర్లా పడ్డారని చెబుతున్నారు. ఎన్డీఏమిత్రపక్షాలతోనే కాదు.. చివరికి బీజేపీ ఎంపీలకు కూడా ఏం జరుగుతుందో తెలియలేదని..వారేదో మ్యాజిక్ చేస్తారని అనుకున్నారని ఆర్కే చెబుతున్నారు. నిజంగా వారు చేయాలనుకున్నది..జరగాలనుకున్నది ఇదే కావొచ్చు. మోదీ, షాల రాజకీయాలను ఆర్కే ఏమి అంచనా వేయగలరు?. అందరూ ఊహించినట్లుగా రాజకీయాలు చేస్తే వారు మోదీ, షాలు ఎందుకవుతారు?

