బౌండరీ దెబ్బకు ఐసీసీ రూల్స్ క్లీన్ బౌల్డ్ ..!

జంటిల్మన్ గేమ్ క్రికెట్‌లో అప్పుడప్పుడూ వివాదాలు వస్తూంటాయి. ఆయా మ్యాచ్‌లను క్రికెట్ చరిత్రలో మచ్చలుగా పేర్కొంటూ ఉంటారు. అయితే ఆ వివాదాలన్ని సహజంగా.. ఆటగాళ్ల వైపు నుంచే వస్తూంటాయి. కానీ మొదటి … అదీ కూడా ఓ ప్రపంచకప్ ఫైనల్ లాంటి మ్యాచ్.. ఐసీసీ తుగ్లక్ రూల్స్ వల్ల… ఓ మచ్చగా… చరిత్రలో నిలిచిపోతోంది. మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగినా… మ్యాచ్‌లో రూల్స్‌ పేరుతో తీసుకున్న నిర్ణయాలు.. క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకోలేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. పలు నిర్ణయాలు.. అత్యంత ఆశ్చర్యకరంగా.. అతిశయోక్తిగా ఉండటమే దీనికి కారణం.

రెండు జట్ల స్కోర్లు సమమైనప్పుడు..సూపర్ ఓవర్ అన్నారు సరే..అందులోనూ స్కోర్లు లెవల్ అయినప్పుడు..సిల్లీగా బౌండరీ కౌంట్ నిబంధన పెట్టారు. అంటే సూపర్ ఓవర్లో స్కోర్ టై అయితే.. ఎవరు ఎక్కువ బౌండరీలు కొట్టారో వాళ్లే విజేతట. ఇదేం నిబంధన… అనే చర్చ అన్ని క్రికెట్ ప్రేమికుల దేశాల్లో నడుస్తోంది. ఐసీసీని సోషల్ మీడియాలో అభిమానులు ఆడేసుకుంటున్నారు..ప్రపంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినా.. నైతికంగా ఓడిపోయిందంటున్నారు.. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండే ఘ‌న విజ‌యం సాధించింద‌ని, ప్రపంచ‌క‌ప్ విజేత‌గా తాము బ్లాక్ క్యాప్స్‌ను గుర్తిస్తామంటున్నారు.. క్రికెట్ మక్కాగా చెప్పుకొనే లార్డ్స్ గ్రౌండ్‌లో క్రికెట్‌ను చంపేశార‌ని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ ఎంత ఉత్కంఠను రేపిందో.. బౌండరీ కౌంట్ నిర్ణయం అంత వివాదాన్ని రేపుతోంది.

ఇది మాత్రమే కాదు.. ఓ ఓవర్ త్రోకి ఆరు పరుగులు ఇవ్వడం కూడా ఏ నిబంధన అంటున్నారు క్రికెట్ ప్రేమికులు. టార్గెట్‌ ఛేజ్‌లో ఇంగ్లండ్ ఆరు బంతుల్లో పదిహేను పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే హాఫ్‌ సెంచరీ చేసిన బెన్ స్టోక్స్‌..కివీస్ విజయానికి అడ్డుగోడలా నిలబడ్డాడు. మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన టైమ్‌లో జరిగిన ఘటన మ్యాచ్‌ను అదే మలుపు తిప్పింది. నాలుగో బంతిని డీప్‌లోకి తరలించిన స్టోక్స్‌.. రెండు పరుగులు తీశాడు. అయితే, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్‌ గఫ్టిల్‌ విసిరిన ఓవర్‌ త్రో… నేరుగా స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలింది. ఆ తర్వా త వేగంగా వెళ్లి బౌండరీ లైన్‌ను దాటేసింది.. గప్టిల్ ఓవర్‌ త్రో కారణంగా ఇంగ్లండ్‌ ఖాతాలో ఆరు పరుగులు చేరాయి. ఒక ఓవ‌ర్‌త్రోలో ఆరు పరుగులు ఇవ్వాలా లేక ఐదు పరుగులు ఇవ్వాలా అన్నది ఐసీసీనే అధికారికంగా ప్రకటించింది. ఓవ‌ర్‌త్రో రూపంలో బంతి బౌండ‌రీ వెళ్లినా లేక ఫీల్డర్ కావాల‌ని అడ్డుకున్నప్పుడు బంతి బౌండ‌రీ దాటిన సంద‌ర్భాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో 19 పాయింట్ 8 రూల్ చెబుతుంది. ఆ రూల్ ప్రకారం ఇంగ్లాండ్‌కు 5 పరుగులు మాత్రమే ఇవ్వాలి. కానీ, అంపైర్ ధ‌ర్మసేన ఆరు ప‌రుగులు ఇచ్చాడు. అంతేకాదు… 19 పాయింట్ 8 రూల్‌లోని ఓ క్లాజ్ ప్రకారం.. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు.. ఫీల్డర్ బంతిని అందుకుని త్రో వేసే లోపు పిచ్ మధ్య భాగాన్ని క్రాస్ చేయ‌లేదు. ఆ లెక్క ప్రకారం బ్యాట్స్‌మెన్ రెండు ప‌రుగులు చేసినా.. ఖాతాలో ఒక్క ర‌న్ మాత్రమే జ‌త చేయాలి. కానీ, అంఫైర్ ధర్మసేన ఆరు పరుగులు ఇవ్వడంతో ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యాక్సిడెంటల్ సిక్సే కాదు.. మరో సిక్స్‌ కూడా కివీస్ ఓటమికి కారణమైంది 48 పాయింట్ 4 ఓవర్ల వద్ద … స్టోక్స్‌ కొట్టిన భారీషాట్‌ను బౌల్ట్‌ క్యాచ్‌ పట్టినా.. బౌండరీ లైన్‌ తాకడంతో అది సిక్స్‌ అయింది. బౌల్డ్‌ ముందుగానే బాల్ విసిరివుంటే.. స్టోక్స్‌ ఔట్‌ అయ్యేవాడు… కివీస్ ఈజీగా విజయం సాధించేది. మొత్తంగా మైదానంలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న కివీస్‌కు.. అదృష్టం కలిసిరాలేదు. ఐసీసీ రూల్స్‌, చెత్త అంపైరింగ్‌ ఓటమికి కారణమయ్యాయి. కానీ ఈ మ్యాచ్‌తో మాత్రం చాలా కొత్త చర్చ తెరపైకి వస్తోంది. ఐసీబీ నిబంధనలు మార్చుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close