వివేకా హత్య కేసును తీసుకుంటామన్న సీబీఐ..!

వివేకా హత్య కేసును దర్యాప్తు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. సిద్దంగానే ఉన్నామని సీబీఐ .. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలియచేయడం చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని.. సీబీఐకి ఇవ్వాలని కోరుతూ.. వైఎస్ జగన్, వైఎస్ వివేకా, ఎమ్మెల్సీ టెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో.. ఆ పిటిషన్‌పై ఉత్తర్వులు వద్దని మరో అఫిడవిట్ ఇచ్చారు. దాంతో ఆయన సీబీఐ విచారణ కోరడం లేదని స్పష్టమవుతోంది. మిగతా అందరూ మాత్రం.. వివేకా హత్య కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ… ప్రభుత్వం తీరుపైనే సందేహం వ్యక్తం చేస్తూ.. సీబీఐ విచారణ గట్టిగా అడిగారు.

ఈ విషయంపై సీబీఐ అభిప్రాయాన్ని హైకోర్టు అడిగింది. తాము విచారణ చేపట్టడానికి సిద్ధంగానే ఉన్నామని సీబీఐ తెలిపింది. అయితే.. ప్రభుత్వం తరపున అభిప్రాయం చెప్పడానికి మాత్రం.. అడ్వొకేట్ జనరల్ సిద్దంగా లేరు. అప్పటి వరకూ ప్రభుత్వం తరపున పలు కేసుల్లో వాదించిన ఏజీ.. ఈ కేసు విచారణకు మాత్రం కోర్టు హాల్లోకి రాలేదు. ఈ కేసులో గతంలో పలుమార్లు తన దగ్గర పూర్తి వివరాలు లేవని.. వాయిదా కోరిన ఏజీ.. నిన్న అసలు కోర్టుకే హాజరు కాలేదు. దాంతో.. కేసును విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. సీబీఐ విచారణ కావాలంటే… ఒక సమస్య.. వద్దు అంటే మరో సమస్య వచ్చి పడుతుంది. అందుకే… వీలైనంత వరకూ.. వాయిదాలతో గడిపేయాలన్న ఆలోచన… ప్రభుత్వం చేస్తోందంటున్నారు. ఈ పరిణామం… ప్రభుత్వం తీరుపై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.

హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా.. గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధరన్‌ను నియమించారు. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతాయేమోనని.. జగన్ అండ్ కో ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా.. హైకోర్టులో… వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ..సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసును విచారణ చేయడానికి కూడా అంగీకారం తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తొలిసారి మీడియా ముందుకు ‘క‌ల్కి’

ఈ యేడాది విడుద‌ల కాబోతున్న అతి పెద్ద ప్రాజెక్టుల‌లో 'క‌ల్కి' ఒక‌టి. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ సినీ లోకం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ చిత్రానికి...

పూరి… హీరోల లిస్టు స్ట్రాంగే!

త‌ర‌వాత ఎవ‌రితో సినిమా చేయాల‌న్న విష‌యంపై పూరి జ‌గ‌న్నాథ్ పెద్ద‌గా ఆలోచించ‌డు. ఎందుకంటే పూరి స్టామినా అలాంటిది. త‌ను ఫ్లాపుల్లో ఉన్నా ఎవ‌రికీ లొంగ‌డు, భ‌య‌ప‌డ‌డు. ఇండ‌స్ట్రీలో ఉన్న ఏ హీరోతో అయినా...

వైసీపీకి బొత్స రాజీనామా..?

వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీని వీడుతున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఆయన పేరుతోనే ఈ లేఖ బయటకు...

ఏపీ నుంచి ఐ ప్యాక్ ప్యాకప్..!!

ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన ఐ ప్యాక్ టీమ్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఉన్నట్టుండి మూడు వందల మంది ఉద్యోగులు వెళ్ళిపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల విజయవాడలోని ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close