బోస్టన్ యూటర్న్.. ఆ నివేదిక అధికారికం కాదట..!

ఇండియాలో జూన్ వరకూ.. పూర్తి స్థాయి లాక్‌డౌన్ ఆ తర్వాత సెప్టెంబర్ వరకూ పాక్షిక లాక్‌డౌన్ ఉంటుందని నివేదిక విడుదల బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ … తూచ్ అనేసింది. తమ పేరుతో సర్క్యూలేట్ అవుతున్న నివేదికను తాము అధికారికంగా విడుదల చేసింది కాదని స్పష్టం చేసింది. ఈ నివేదిక విడుదలై నాలుగైదు రోజులు అవుతోంది. అప్పుడే దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. లాక్‌డౌన్ ఎత్తివేతపై ఎలాంటి సూచనలు లేవని.. స్పష్టం చేసింది . అయితే.. అదే రిపోర్టును తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో చూపించి… భారత్‌లో పరిస్థితి భయంకరంగా మారబోతోందని.. బీసీజీ చెప్పిందని.. అందుకే లాక్ డౌన్ పొడిగించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ నివేదికను.. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు కేసీఆర్. దీంతో మరో సారి.. ఆ నివేదిక గురించి చర్చ ప్రారంభమయింది. ఆ నివేదిక సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫార్వార్డ్ అయింది.

ఇదేదో తేడా జరుగుతుందని బీసీజీ అనుకుందేమో కానీ.. వెంటనే… యూటర్న్ తీసుకుంది. ఆ నివేదికకు ఎలాంటి అథంటికేషన్ లేదని..తాము అధికారికంగా ఎలాంటి పరిశోధన చేసి.. నివేదిక విడుదల చేయలేదని స్పష్టం చేసింది. అది.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధికారిక రిపోర్ట్ కాదని తేల్చి చెప్పేసింది. ఈ మేరకు మీడియా సంస్థలకు స్పష్టమైన సమాచారం పంపింది. పూర్తి స్థాయిలో బీసీజీ అధికారిక ముద్రలతో విడుదలైన రిపోర్ట్ పై… ఒక్క సారి బీసీజీ యూటర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తాము ప్రిపేర్ చేయలేదని.. ఆ సంస్థ చెప్పడం లేదు కానీ… అధికారిక రిపోర్ట్ కాదని మాత్రంచెబుతోంది.

అంటే… ఓ వ్యూహం ప్రకారం… కావాలనే.. దాన్ని రిలీజ్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ విషయంలో బీసీజీపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో మూడు రాజధానుల అంశంపైనా… ఇదే తరహా రిపోర్ట్ ను…ప్రభుత్వానికి సమర్పించి రూ.ఏడు కోట్ల ప్రజాధనాన్ని ఫీజుగా పొందింది. ఎలాంటి కసరత్తు చేయకుండానే అంతకు ముందు ప్రభుత్వం ప్రకటించిన ఓ బ్లూప్రింట్‌లోని అంశాలతో ఆ నివేదిక ఉంది. ఇప్పుడు..లాక్ డౌన్ నివేదిక రచ్చ అయ్యే అవకాశం ఉండటంతో.. అధికారికం కాదని చెప్పుకొస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close