సీఎంతో  మళ్లీ మోడీ చర్చ..! ఎగ్జిట్ ప్లానా..? పొడిగింపు వ్యూహమా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇరవై ఏడో తేదీన ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. ఎజెండా వైరస్ ను కట్టడి చేయడంపై ముఖ్యమంత్రులతో చర్చించడమే. అయితే… ఇప్పటికి లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత మూడు సార్లు ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. మూడు సార్లూ.. ఓ ప్రత్యేకమైన కారణంపై అభిప్రాయం తెలుసుకోవడానికే పెట్టారు. నేరుగా కాకపోయినా… పరోక్షంగా అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సారి వీడియో కాన్ఫరెన్స్‌లో ఏ అంశంపై ముఖ్యమంత్రుల ఓపినియన్స్ తెలుసుకంటారన్న చర్చ ప్రారంభమయింది.

ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి ఎలా బయటపడాలన్నదానిపై కేంద్రం సమాలోచనలు జరుపుతోంది. ఎగ్జిట్ ప్లాన్స్‌పై సీరియస్‌గా చర్చిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్‌నాథ్ నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా చర్చలు జరిపింది. మూడో తేదీ వరకు.. కేంద్రం లాక్ డౌన్ ఉంది. ఆ తర్వాత ఒక్క సారిగా ఎత్తేస్తే పరిస్థితులు విషమిస్తాయి. ఎలా చూసినా.. లాక్ డౌన్ ఎత్తివేతకు ఓ వ్యూహం అమలు చేయాల్సి ఉంటుంది. దీనిపై ముఖ్యమంత్రులతో చర్చిస్తారని అంటున్నారు. సీఎంల అభిప్రాయాలు తెలుసుకుంటారని చెబుతున్నారు. అయితే… ప్రస్తుతం దేశంలో వైరస్ ఉద్ధృతి ఏ మాత్రం తగ్గలేదు. ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ కారణంగా లాక్ డౌన్ పొడిగిస్తే.. ఎలా ఉంటుందన్న దానిపైనా ముఖ్యమంత్రులతో మోడీ చర్చిస్తారని మరి కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్రాలతో చర్చించాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం సూచనలు మాత్రమే చేస్తోంది. అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. అందుకే… పలు రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన మినహాయింపుల్ని అమలు చేయకుండా లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఎక్కువ రిలాక్సేషన్స్ ఇచ్చేశాయి. దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది కూడా. 27వ తేదీన… నరేంద్రమోడీ.. లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ లేదా కొనసాగింపుపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close