జగన్ కొత్త కాన్సెప్ట్ : రైతులకు వన్‌స్టాప్ సర్వీస్ సెంటర్ ..!

రైతులకు వన్ స్టాప్ సర్వీస్ సెంటర్‌ను జగన్ ఏర్పాటు చేస్తున్నారు. అదే రైతు భరోసా కేంద్రం. రైతులకు కావాల్సిన అన్ని అవసరాలు ఆ కేంద్రంలో తీరేలా .. ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా… మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వినూత్న సంస్కరణకు తెరతీయాలని జగన్ నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడం ద్వారా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న నమ్మకంతో కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయశాఖ సూచనలు, సలహాలతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. రైతుభరోసా కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్, ఇంటర్ ఫేస్, ఇంటర్ వెన్షన్ సిస్టమ్ తో పాటుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ రంగాలశాఖల అధికారుల సూచనలు, సలహాలను రైతులు నేరుగా పొందొచ్చు. నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, రసాయన ఎరువులు అందించే సంస్థగానే కాకుండా రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేయనున్నాయి. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.

రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకుడు, సెరికల్చర్, ఫిషరీస్ అసిస్టెంట్స్ అందుబాటులో ఉంటారు. రైతు భరోసా కేంద్రాలకు మార్కెటింగ్ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఆర్‌బీకేలో ఉండే అధికారులు ప్రతిరోజు పంటకు గిట్టుబాటు ధరలను పరీక్షించడం, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాలను సమీక్షించి సంబంధించిత డేటాను పై అధికారికి పంపడం ద్వారా మార్కెటింగ్‌ శాఖ మానిటరింగ్‌ చేస్తుంది. అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌ లు, టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటుతో రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్ బీకేలు పనిచేయనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close